Sye-Raa-Amitabh-Bachchan-Nayanthara-Vijay-Setupathi-Sudeepమెగాస్టార్ చిరంజీవి నటించిన మొదటి హిస్టారికల్ సినిమా సైరా నరసింహా రెడ్డి ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. ఇప్పటిదాకా ఉన్న టాక్ అండ్ రివ్యూస్ అన్నీ పెద్ద హిట్ కొట్టినట్టే చెబుతున్నాయి. ఈ నెల 13 వరకు దసరా సెలవులు కావడం, సరైన పోటీ లేకపోవడంతో సినిమా బాక్స్ ఆఫీసు వద్ద దుమ్ముదులుపుతుందని విశ్లేషకుల అభిప్రాయం.

ఇక సినిమా తెలుగు, తమిళ, హిందీ, మరియు మలయాళ భాషలలో విడుదల కావడంతో అక్కడి ఆడియన్స్ ను ఆకట్టుకోవడానికి ఆయా పరిశ్రమల సూపర్ స్టార్స్ ను సినిమాలో నటింపచేశారు. హిందీ కోసం అమితాబ్ బచ్చన్, తమిళ్ కోసం విజయ్ సేతుపతి, కన్నడ కోసం సుదీప్ లను వేరు వేరు పాత్రల కోసం తీసుకున్నారు.

అయితే సినిమా చుసిన ప్రతీ ఒక్కరు ఏ ఒక్క స్టార్ కూ న్యాయం చెయ్యగలిగే పాత్ర దక్కలేదని అంటున్నారు. అన్ని పాత్రలు కథానుసారం ప్రధానమైనవిగా కనిపించినా వాటికి పెద్దగా నిడివి ఇవ్వలేదు. దీనితో ఆయా రాష్ట్రాల ప్రేక్షకులు దాని వల్ల ఎంతవరకూ ఇంప్రెస్స్ అవుతారు అనేది చూడాలి. వేరే పరిశ్రమల నుండి కూడా వస్తున్న రివ్యూలు ఆసక్తికరంగానే ఉన్నాయి.

విడుదలకు ముందు సైరా 200 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. అన్ని భాషలలో కలిపి 200 కోట్లు షేర్ రాబడితేనే సినిమా హిట్ గా పరిగణించవచ్చు. టాక్ బావుండడంతో మెగా ఫ్యాన్స్ భారీ ఆశలే పెట్టుకున్నారు. చిరంజీవి కమ్ బ్యాక్ చేసిన ఖైదీ నెంబర్ 150 సినిమా అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లు రాబట్టింది. ఇప్పుడు దానికి రెండింతలు రాబట్టాల్సి ఉంది.