swiss bank reveals black money listస్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్న బ్లాక్ మనీకి రెక్కలు రాబోతున్నాయి. తమ బ్యాంకుల్లో డబ్బు డిపాజిట్ చేసి మళ్ళీ దానివంక కన్నెత్తి చూడకుండా కిమ్మనకుండా ఉన్న డిపాజిట్ దారులకు సుమారు వంద బ్యాంకులు అల్టిమేటం జారీ చేశాయి. మీ సొమ్ము మీరు విత్ డ్రా చేసుకోకపోతే ఇక అది ప్రభుత్వానికే చెందుతుందని పేర్కొన్నాయి. ఈ బ్యాంకుల్లో అకౌంట్లు ఓపెన్ చేసి రెండున్నర వేల మందికి పైగా ఖాతాదారులు సుమారు 60 ఏళ్ళుగా స్తబ్దుగా ఉన్నారు. కనీసం తమ ఖాతాల్లోని సొమ్ము గురించి వారు ఆరా తీయలేదు. అలాంటి వారి పేర్లను స్విస్ బ్యాంకులు ప్రకటించాయి.

తమ అకౌంట్లలోని డబ్బు తీసుకునేందుకు ఇదే చివరి అవకాశమని, దీన్ని మిస్ చేసుకుంటే ఇక మీ డబ్బు ప్రభుత్వ పరమవుతుందని హెచ్చరించాయి. 1955 నుంచి ఇప్పటివరకు దాదాపు 44 మిలియన్ డాలర్ల సొమ్ము ఈ బ్యాంకుల్లో మూలుగుతోంది. ఇందులో భారతీయులకు చెందిన సొమ్ములు కూడా ఉన్నాయి. అయితే వారిలో చాలా మంది ఇతర బ్యాంకులకు తమ డబ్బులు మళ్ళించే యోచనలో ఉన్నారు. ఈ బ్యాంకుల్లో దాచుకునే సొమ్ముకు ఇక సీక్రేసీ అంటూ ఉండక పోవడం కూడా తాజా పరిణామానికి దారి తీసిందని అంటున్నారు. మొత్తం 4,450 అకౌంట్ల వివరాలను ఈ బ్యాంకులు యూఎస్ అధికారులకు అప్పగించినట్టు తెలిసింది.