వైఎస్ రాజశేఖర రెడ్డి తన ప్రజా సంకల్పపాదయాత్ర నిన్నటివరకు 1066.4 కిలోమీటర్ల దూరం సాగింది. ప్రతి శుక్రవారం వచ్చే కోర్టు హాలిడే తప్పితే ఇప్పటివరకు జగన్ 79 రోజులు నడిచారు. జగన్ తన పాదయాత్ర ముహూర్తం సాక్షాత్తు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామితో పెట్టించుకున్నారంట.
swarupananda swami ys jagan
ఆ స్వామినే ఈ విషయాన్నీ వెల్లడించారు. విశాఖ కేంద్రం గా రాజకీయాలు చేసే టి. సుబ్బరామిరెడ్డి మద్దతుతో బాగా పాపులరైన స్వరూపానంద తరచు రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ టీడీపీని ఇరుకునపెడుతూ జగన్ కు మద్దత్తు ఇస్తూ ఉంటారు ఈ సాములోరు. వైఎస్ జగన్ తన మీద ఉన్న క్రిష్టియన్ అనే ముద్ర తొలగించుకోవడానికి స్వరూపానంద ఆధ్వర్యంలో అనేక పూజలు, యజ్ఞాలు చేస్తుంటారు కూడా.

జగన్ క్రిస్టియన్ అయినా ఆయనలో నిజమైన హిందువును చూసా అని ఆయన చెప్పుకొచ్చారు. మొన్న ఆ మధ్య సాక్షాత్తు ఆయన ముందే బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జగన్ నమ్మినబంటు విజయ సాయి రెడ్డి వినమ్రంగా కూర్చున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది.