swarupananda swami- ys jaganజగన్ పార్టీకి వీరఅభిమానిగా గుర్తింపబడ్డ స్వామీ స్వరూపానంద మరోసారి చంద్రబాబు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు బౌద్దమతాన్ని ప్రచారం చేసే విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని ఆద్యాత్మికవేత్త , శారదాపీఠం అధినేత స్వరూపానందేంద్ర స్వామి ప్రశ్నించారు.

బుద్ధుడు వైరాగ్యం, శూన్య వాదం, నిస్సారమైన ధర్మాన్ని ప్రచారం చేశారు.. అలాంటి బుద్ధుని పేరు పెడితే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. చంద్రబాబు పరిస్థితి అన్నీ ఉన్నా ఐదోతనం లేనట్టుగా ఉందని ఆయన అన్నారు. కొత్తగా అమరావతికి ఈ మతం రంగు పులమడం ఏంటో? అమరావతి అంటే ఇంద్రుడి పాలించిన నగరం అని మన పురాణాలు చెబుతున్నాయి కదా?

పైగా అమరావతిలో సకల సుఖాలు ఉంటాయని, అక్కడి స్తంభాలు వజ్రాలతో నిర్మించబడినవని, అక్కడి రాజమందిరాలు – కూర్చునే వస్తువులు బంగారంతో చేసి ఉంటాయని కూడా ఉంది. ఆ రకంగా చూస్తే అమరావతి అనే పేరు మంచిదే కదా. కాకపోతే సాములోరికి కూడా తన రాజకీయ అభిలాష బట్టి కావాల్సినవి కనపడటం అక్కర్లేనివి కనపడకపోవడం జరగడం విచారకరం.