Swamy Goud TRSఆరేళ్ళ పాటు తెలంగాణని మకుటం లేని మహారాజుగా ఏలిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఈ మధ్య ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతున్నట్టుగా కనిపిస్తుంది. తెలంగాణలో కరోనా ని కంట్రోల్ చెయ్యడంలో కేసీఆర్ సర్కారు పూర్తిగా విఫలం కావడం అదే సమయంలో కేసుల సంఖ్యను మసిపూసి మారేడు కాయ చెయ్యడం, ప్రైవేటు దోపిడీని అరికట్టడం వంటి వాటితో ప్రజలలో కూడా వ్యతిరేకత తెచ్చుకున్నారు.

ప్రజలలో వ్యతిరేకత రాగానే సొంత నాయకులు కూడా దారితప్పుతున్నట్టుగా కనిపిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆ పార్టీలో అసమ్మతి స్వరం వినిపించింది.శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు తనకు అప్పాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదని తెలిపారు.

తెలంగాణ ఉద్యమంలో అన్నిటిని ఎదుర్కున్న తమకు ఆత్మగౌరవ సమస్య ఎదురవుతోందని ఆయన అన్నారు. ఉద్యమం సమయంలో తమను హేళన చేసినవారు ఇప్పుడు మంచి గుర్తింపు పొందుతున్నారని ఆయన అన్నారు. సహజంగా పార్టీ వీక్ అయినప్పుడు అసమ్మతి అనేది కనిపిస్తూ ఉంటుంది.

అటువంటి సమయంలోనే గతంలోనే పదవులు అనుభవించిన వాళ్ళు.. రాజకీయ నిరుద్యోగులకు కూడా నోరు లెగుస్తుంది. దుబ్బాక ఉపఎన్నిక నేపథ్యంలో ఇటువంటి పరిస్థితులు కనపడటం కేసీఆర్ కు మంచిది కాదు అనే చెప్పుకోవాలి. దీనిని కేసీఆర్ ఎలా ఎదురుకుంటారో చూడాలి.