Susheela enters book of Guinness World Recordsప్రముఖ సినీ నేపథ్య గాయని పి.సుశీల గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్నారు. తెలుగు, సంస్కృతం, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, ఒరియా, తుళు భాషల్లో మధుర గీతాలను ఆలపించి, శ్రోతల హృదయాలలో నిలిచిపోయిన ఆమెను “గానకోకిల”గా అభిమానులు పిలుచుకుంటారు.

ఆరు భాషల్లో సోలో, డ్యూయట్, కోరస్ లతో కలిసి మొత్తం 17,695 పాటలను ఆమె పాడారు. ఈ అరుదైన ఘనత సాధించినందుకు గాను ఆమె పేరు ‘గిన్నిస్’లో కెక్కింది. కాగా, ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి ఆమె వేలాది యుగళగీతాలను ఆలపించారు.