Sushanth tweet on Mahesh Babuకెరీర్ లో తొలిసారిగా “ఛి||ల||సౌ||” సినిమాతో పాజిటివ్ టాక్ అందుకున్న సుశాంత్, ప్రస్తుతం సంతోషంలో మునిగి తేలుతున్నట్లుగా కనపడుతోంది. ఓ పక్కన సినిమా ప్రచారానికి తోడు మరో పక్కన ఆసక్తికరమైన ట్వీట్స్ చేస్తూ నెటిజన్లకు అందుబాటులో ఉంటున్నాడు సుశాంత్. ఈ క్రమంలోనే అన్నపూర్ణ స్టూడియోస్ లో ఉన్న సూపర్ స్టార్ పిక్ ను పోస్ట్ చేసాడు.

తన రూమ్ పక్కనే ఉన్న ఈ బోర్డును చూశానని, అతనిని డిస్టబ్ చేయడం ఇష్టం లేక ఈ పిక్ ను తీసుకున్నానని, అయినా “ఎస్వీసి హీరో గారు” అని ఉన్న ఆ నేమ్ ప్లేట్ ఒక్కటి చాలు, సూపర్ స్టార్ ఆరాను తెలియజేస్తుందంటూ ట్వీట్ చేసాడు సుశాంత్. ఈ ట్వీట్ కు ప్రిన్స్ అభిమానుల నుండి సుశాంత్ కు భారీ స్పందన వస్తోంది. ఫస్ట్ లుక్ కోసం వేచిచూసే ఆనందంలో ఫ్యాన్స్ అంతా 9వ తేదీ కోసం నిరీక్షిస్తున్నారు.Sushanth tweet on Mahesh Babu