Sushant Singh Rajput Case CBIకొద్దిసేపటి క్రితం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణ కేసును సుప్రీంకోర్టు విచారించింది. అతని ప్రియురాలు, రియా చక్రవర్తి ఈ కేసులో మధ్యంతర ఉపశమనం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అధికారులు ఆమెపై ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఉత్తరువులు ఇవ్వాలని ఆమె తరపున లాయర్ కోర్టును కోరారు.

ఈ కేసుపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాలన్న బీహార్ ప్రభుత్వం చేసిన సిఫారసును యూనియన్ ఆఫ్ ఇండియా సూత్రప్రాయంగా అంగీకరించిందని, ఈ రోజు సాయంత్రం లోగా ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉందని కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు.

అయితే, బీహార్ పోలీసు చర్యలు రాజకీయంగా ప్రేరేపించబడిందని మహారాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరైన న్యాయవాది చెప్పారు. ఈ కేసులో బీహార్ పోలీసులను లేదా సిబిఐ ప్రమేయాన్ని ప్రభుత్వం అంగీకరించేది లేదని కోర్టుకు తెలిపారు. రియా చక్రవర్తికి ఎటువంటి ఉపశమనం ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.

గతంలో బాలీవుడ్ నటి జియా ఖాన్ ఆత్మహత్య కేసు కూడా సిబిఐకి చేరిన ఎటువంటి ఫలితం దక్కలేదు. ఆమె తల్లిదండ్రులు ఇంకా తమకు న్యాయం జరగలేదనే అంటున్నారు. అయితే ఈ సారి సుశాంత్ సింగ్ రాజపుట్ కేసులోనైనా న్యాయం జరుగుతుందని అంతా భావిస్తున్నారు.