surya 24 Movie  Teaser - First Look‘మనం’ సినిమా దర్శకుడు విక్రం కుమార్ దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కుతున్న సినిమా “24.” ఈ సినిమా తొలి టీజర్ ను 4వ తేదీ సాయంత్రం 6 గంటలకు విడుదల కానున్న విషయం నెటిజన్లకు తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ సినిమా టీజర్ యూ ట్యూబ్ లో హల్చల్ చేస్తోంది.

సూర్య నటించిన ‘సెవెంత్ సెన్స్’ సినిమాలోని కొన్ని సీన్లకు, మరికొన్ని హాలీవుడ్ సినిమాల దృశ్యాలను కలిపి ఒక టీజర్ ను రూపొందించి యూ ట్యూబ్ లో విడుదల చేయగా, అదే ‘24’ సినిమా టీజర్ గా ప్రచారమవుతోంది. డైలాగ్స్ లేకుండా కేవలం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో రన్ అయ్యే ఈ టీజర్ కు బాగానే కట్ చేసారు.

సాధారణంగా ఒక రేంజ్ సినిమాలకు మాత్రమే అభిమానులు రూపొందించే ముందస్తు టీజర్లు సందడి చేస్తుంటాయి. రజనీకాంత్, పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎక్కువగా ఫ్యాన్స్ ఇలాంటి ఫేక్ టీజర్లతో యూ ట్యూబ్ లో తమ అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. తాజాగా ఆ జాబితాలో సూర్య కూడా చేరడం విశేషం. అంటే సూర్య క్రేజ్ విపరీతంగా పెరిగిందో లేక ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయో గానీ విడుదలైన తర్వాత “24” టీజర్ ఒక సెన్సేషన్ సృష్టించేలా కనపడుతోంది.