Surveys over estimation on narendra modi waveనిన్నటితో పూర్తయిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై దేశంలోని ప్రసిద్ధ సర్వే సంస్థలు తన అంచనాలు విడుదల చేశాయి. మొత్తంగా సర్వేలు చూస్తుంటే మరోసారి కేంద్రంలో నరేంద్ర మోడీ మరో సారి అధికారం చేజిక్కించుకునే అవకాశం కనిపిస్తోంది. గత 48 ఏళ్లలో సొంతంగా రెండు సార్లు వరుసగా అధికారికంగా వచ్చిన ప్రధానమంత్రిగా మోడీ చరిత్ర పుటల్లోకి ఎక్కనున్నారు. చంద్రబాబు ఆశపడినట్టు యూపీఏగానీ కేసీఆర్ ఆశపడినట్టు ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వంగానీ ఏర్పడే అవకాశమే లేదని సర్వేలు తేల్చేశాయి.

చాలా సర్వే సంస్థలు ఏకంగా 2014 కంటే కూడా ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పారు బీజేపీకి. రాజకీయ విశ్లేషకుల ప్రకారం మోడీ వేవ్ ని సర్వేలు ఓవర్ ఎస్టిమేట్ చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. “బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. సొంతంగా రాకపోయినా మిత్రుల సాయంతో వచ్చే అవకాశం ఉంది. ఆ అవసరం ఎంత వరకూ ఉంటుంది అనేది చూడాలి. అయితే 2014 కంటే మెరుగైన ఫలితాలు రాబట్టడం అంత తేలిక కాదు,” అని వారు విశ్లేషించారు.

“మోడీ రావడం ఖాయమని తేలినప్పుడు ఈ టీవీ ఛానల్స్ అటుఇటుగా సర్వేలు ఇచ్చి మోడీ అమిత్ షాల కోపానికి గురికావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎంత ఎక్కువగా ఇస్తే అంతగా మోడీ దృష్టిలో పడొచ్చు. గతంలో 2014 సందర్భంగా బీజేపీని సర్వేలు తక్కువ అంచనా వేసాయి. అది దృష్టిలో పెట్టుకుని కూడా ఎక్కువగా ఇచ్చి ఉండొచ్చు,” అని వారు అంటున్నారు. అయితే ఇందులో ఏది నిజం ఏది అబద్దం అనేది తేలాలంటే 23వ తారీఖు వరకు ఆగాల్సిందే.