Survey reports Andhra pradesh people against Narendra Modi ఏబీపీ న్యూస్ – సీఎస్డీఎస్ సంస్థతో కలిసి నిర్వహించిన సర్వేలో మోడీపై అత్యంత వ్యతిరేకత ఉన్న రాష్ట్రాలలో రెండో ర్యాంకులో ఉంది ఆంధ్ర ప్రదేశ్. దాదాపుగా 68% శాతం ప్రజలు తాము మోడీ ప్రభుత్వంతో సంతృప్తిగా లేము అని తెలిపారట. మొదటి స్థానంలో మన పక్కనే ఉన్న తమిళనాడు ఉందట.

అక్కడ ఏకంగా 75% ప్రజలు మోడీ ప్రభుత్వం మీద వ్యతిరేకత చూపిస్తున్నారంట. మిగిలిన దక్షిణాది రాష్టాల్లో కూడా అదే పరిస్థితి ఉందంట. కేరళలో 64% వ్యతిరేకత. బీజేపీ ప్రభావం చూపించగలదు అనుకుంటున్న తెలంగాణలో సైతం 63% ప్రజలు కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారట.

దక్షిణాదిన ఒక్క కర్ణాటకలో మాత్రమే మోడీ ప్రభుత్వం మీద వ్యతిరేకత కొంత తక్కువగా ఉంది. అక్కడ 45% ప్రజలు మోడీ ప్రభుత్వంపై వ్యతిరేకత చుపిస్తున్నారట. దీనిబట్టి వచ్చే ఎన్నికలలో బీజేపీకి దక్షిణాదిన చుక్కలు కనిపించడం ఖాయంగా కనిపిస్తుంది. బీజేపీకి పెద్దగా మిత్రులు కనిపించే అవకాశం కూడా కనపడటం లేదు.