Survey report Pawan Kalyan JanaSena got very less voting percentageఏబీపీ న్యూస్ ఛానల్ మొన్న ఒక సర్వేలో కాంగ్రెస్ బలపడుతుంది అని చెప్పడంతో కమలనాధులు ఉలిక్కిపడినట్టుగా ఉంది. ఉన్నఫళంగా తమ అనుకూల మీడియాతో తమకు అనుకూల సర్వే విడుదల చేయించున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఈ సర్వే వైకాపాకు మొదటి స్థానం ఇచ్చింది. ఆ పార్టీకి 40% ఓటర్ల మద్దత్తు ఉందట.

తెలుగు దేశంపై 37% ఓటర్ల మద్దత్తు ఉందట. మరోవైపు బీజేపీ, జనసేనకు 8% ఓటర్ల మద్దత్తు ఉందట. బీజేపీకి జనసేనకు సమానమైన ఓటర్ల మద్దత్తు ఉందంటేనే ఈ సర్వే డొల్లతనం అర్ధం చేసుకోవచ్చు. మోడీ వేవ్ ప్రబలంగా ఉన్నప్పుడు బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో అంత మద్దత్తు లేదు. ఈరోజు రాష్ట్రాన్ని వంచించాక అంత వచ్చిందంటే నమ్మడం కష్టమే.

మరోవైపు సినీఅకర్షణ ఉన్న పవన్ కళ్యాణ్ తో సమానం అంటే ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు. ఒకప్పటి మిత్రపక్షం మీద ఉన్న అక్కసుతో జగన్ పార్టీని మొదటి స్థానంలో పెట్టించారా అనే గుసగుసలు వినపడుతున్నాయి. మరోవైపు ఇది సర్వే బీజేపీకి తెలంగాణాలో 20% ఓటుబ్యాంక్ ఉందని చెప్పింది.

35% ఓట్లతో తెరాస మొదటి స్థానంలో, 25% ఓట్లతో కాంగ్రెస్ రెండో స్థానంలో ఉన్నాయట. తెరాస కాంగ్రెస్ మధ్య వ్యత్యాసం నమ్మగలిగేదిగా ఉన్నా బీజేపీ కాంగ్రెస్ కు దగ్గర్లో ఉందంటే అది సత్యదూరమే. రెండు తెలుగు రాష్ట్రాలలో బీజేపీ పరిస్థితి మన అందరికి తెలియంది కాదు.