Suriya response on NGK movie Resultఒక్కప్పుడు తెలుగు, తమిళ భాషల్లో సూర్యకు సమానమైన క్రేజ్ ఉండేది. గజిని, సింగం సిరీస్ లాంటి చిత్రాలతో సూర్య తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా చేరువయ్యాడు. అప్పటి నుండి సూర్య నటించిన ప్రతి చిత్రం తెలుగులో కూడా అనువాదం అవుతూ ఉంటుంది. అయితే కొన్ని సంవత్సరాలుగా ఆయనను పరాజయాలు చుట్టుముడుతున్నాయి. ఇటీవల సూర్య నటించిన చిత్రం ఎన్జీకే విడుదలయ్యి బాక్స్ ఆఫీసు వద్ద బోల్తా కొట్టింది.

ఎన్జీకే చిత్రంపై మీ అభిప్రాయాలని, ప్రేమని, ఆలోచనలని గౌరవంగా స్వీకరిస్తున్నా. అలాగే చిత్రాన్ని, నటీనటుల పెర్ఫామెన్స్ ని డీకోడ్ చేసి అర్ధం చేసుకుని మెచ్చుకున్న మాస్టర్ మైండ్స్ అందరికీ కృతజ్ఞతలు. ఈ చిత్రం కోసం పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు అని సూర్య ట్వీట్ చేశాడు. అయితే ఒక సినిమాను ఆస్వాదించడానికి చిత్రాన్ని డీకోడ్ చెయ్యాల్సి రావడం, అందుకుగానూ మాస్టర్ మైండ్ ఉండాల్సి రావడం వల్లే సినిమా దొబ్బింది అని నెటిజెన్లు గెలిచేస్తున్నారు.

అయితే పరాజయాన్ని హుందాగా ఒప్పుకున్నందుకు సూర్యను మెచ్చుకోవాలి. ఇది ఇలా ఉండగా త్వరలో సూర్య మరో భారీ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కెవి ఆనంద్ దర్శకత్వంలో కాప్పాన్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. సూర్య ఈ చిత్రంలో ప్రధానికి రక్షణ కల్పించే అధికారి పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో అయినా సూర్య అటు తమిళ ప్రేక్షకులను ఇటు తెలుగు ప్రేక్షకులను మెప్పించగలడేమో చూడాలి.