Suriya jai bhim movie on OTTప్రస్తుతం థియేటర్ వర్సెస్ OTT వార్ జరుగుతుంది. ప్రతీ ఇండస్ట్రీలో కొందరు ఓటీటీ ని సపోర్ట్ చేస్తూ సినిమాలు , వెబ్ మూవీస్, సిరీస్ లు చేస్తుంటే ఇంకొందరు మాత్రం థియేటర్స్ వ్యవస్థ గురించి అలాగే తమ అభిమానుల గురించి ఆలోచిస్తూ తమ సినిమాలు థియేటర్స్ లోనే రిలీజ్ ఉండాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. ప్రతీ వారం థియేటర్స్ లో సినిమాలు రిలీజ్ అవుతుంటే మరో పక్క ఓటీటీ లో కూడా అదే స్థాయిలో సినిమాలు రిలీజ్ అవుతూ ప్రేక్షకుల నెట్టింట్లోకి వచ్చేస్తున్నాయి.

ఇక స్టార్ హీరోల్లో కొందరు ఇప్పటికే ఓటీటీ స్టార్ అనే బిరుదు అందుకుంటున్నారు. అందులో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఒకడు. అవును ఇప్పటికే సూర్య నటించిన సినిమాతో పాటు నిర్మించిన సినిమా కూడా డైరెక్ట్ ఓటీటీ లో రిలీజ్ చేశాడు. భార్య జ్యోతిక ప్రధాన పాత్రలో ‘పొన్మగల్ వందాల్’ అనే స్టోరీ బేస్డ్ సినిమా ప్రొడ్యూస్ చేశాడు సూర్య. కరోన ఫస్ట్ వేవ్ టైంలో థియేటర్స్ మూసివేయడం సరిగ్గా అప్పుడే OTT నుండి మంచి ఆఫర్ రావడంతో అమ్మేశాడు. దీంతో సూర్యపై కోలీవుడ్ డిస్ట్రిబ్యూటర్స్ , ఎగ్జిబ్యూటర్స్ గుస్సా అయి ఇకపై సూర్య సినిమాలు థియేటర్స్ బ్యాన్ అనే కాల్ తీసుకునేంత వెళ్లారు.

ఇక తర్వాత సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా కూడా డైరెక్ట్ గా ఒటీటీ లో విడుదలైంది. స్టార్టింగ్ ఓటీటీలో స్టార్ సినిమా రావడంతో అన్ని భాషల్లో ఆ సినిమాను గట్టిగానే చూసి OTT బ్లాక్ బస్టర్ చేశారు. ఇక ఈ రెండు సినిమాలతోనే ఆగిపోకుండా తను నటించిన మరో సినిమా ‘జై భీమ్’ ను కూడా OTT సంస్థకి ఇచ్చేశాడు. తమిళనాడులో త్వరలోనే థియేటర్స్ తెరుస్తున్నారు. రజినీ కాంత్ సినిమాతో అక్కడ మళ్ళీ మార్కెట్ ఓపెన్ అవ్వనుంది. ఇక థియేటర్స్ తెరిచాక కూడా సూర్య ముందు కమిట్ అయిన ప్రకారం ఓటిటి కే సినిమాను ఇచ్చేశాడు. పైగా ఈ సినిమా కూడా సూర్య సొంత సినిమానే. సూర్య , జ్యోతిక ఇద్దరూ కలిసి నిర్మించారు. మరి ప్రస్తుతం వరుస సినిమాలతో OTT స్టార్ అనిపించుకుంటున్న సూర్య థియేటర్స్ లో తన సినిమాతో ఎప్పుడొస్తాడో ?