If-this-is-Not-A-Self-Goal,-What-is-Narendra-Modiకర్ణాటక ఎన్నికల కోసమని కావేరీ బోర్డును ఏర్పాటు చెయ్యకుండా తాత్సారం చేస్తుంది మోడీ ప్రభుత్వం. దీనిపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించగా, కేంద్ర ప్రభుత్వంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కోర్టుకు కేంద్రప్రభుత్వం చెప్పిన సమాధానం విస్మయం కలిగించేదిగా ఉంది.

“కావేరి బోర్డు ఏర్పాటు చెయ్యడానికి అవసరమైన డ్రాఫ్ట్ సిద్ధంగా ఉంది. కేంద్ర క్యాబినెట్ ముందు పెట్టి ఆమోదం తీసుకోవాల్సి ఉంది. కాకపోతే ప్రధానితో సహా కేంద్ర మంత్రులు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండడంతో మే 16 తరువాత దానిని చేపడతారు,” అని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలిపింది.

ఒక రాష్ట్ర భవిష్యత్తు కంటే మాకు ఎన్నికలే ముఖ్యం అని ఇంత నిసిగ్గుగా చెప్పడం ఒక్క బీజేపీకే చెల్లింది. మే 15న కర్ణాటక ఎన్నికలు అయిపోతాయి కాబట్టి అప్పుడు కావేరి బోర్డు ఏర్పాటు చేసి వ్యతిరేకత రాకుండా చూసుకుంటారు అన్నమాట. ఇదేమి చవకబారు రాజకీయం మోడీ గారూ! ఇందుకేనా మిమ్మల్ని అశేష మెజారిటీతో ప్రజలు గెలిపించింది.

Amit Shah Avoid Sharing Stage With Janardhan Reddy Brothers