supreme court verdict on AB venkateswara rao ips suspensionప్రభుత్వాలు వాటిని నడిపే ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు మారిపోతుంటారు కానీ ప్రభుత్వ వ్యవస్థను నడిపించే ఐఏఎస్, ఐపీఎస్ తదితర అధికారులు, ఉద్యోగులు మారరు. వారు ప్రభుత్వం కోసమే పనిచేస్తారు తప్ప దానిని నడిపే పార్టీలకు కాదు. వారు ప్రభుత్వానికే విధేయంగా ఉంటారు కానీ వాటిని నడిపే పార్టీలకు కాదు. వారికి ఆ అవసరం లేదు కూడా. కనుక ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వారి పని వారు చేసుకుపోతుంటారు. అయితే అదేవారి పాలిట శాపంగా మారుతోంది. అందుకు ఉదాహరణగా సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏపీ ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరావు కళ్లెదుటే ఉన్నారు.

ఇంతకీ ఆయన చేసిన పాపం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి విధేయంగా పనిచేయడమే. ఆ కారణంగా ఆయన చంద్రబాబు నాయుడు మెప్పు పొందారు. బాబుకి ఆప్తుడు అయితే మనకు శత్రువే అని అండర్ లైన్ చేసేసి 2020, మే నెలలో జగనన్న ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసేసింది. అప్పటి నుంచి నేటి వరకు అంటే రెండేళ్ళుగా ఆయన సస్పెన్షన్ పొడిగిస్తూనే ఉంది.

ఆయన తనకు జరిగిన అన్యాయంపై హైకోర్టును ఆశ్రయించగా అక్కడ ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దాంతో ఏపీ ప్రభుత్వం హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేయగా ఈరోజు అక్కడా ఆయనకు అనుకూలంగానే తీర్పు వచ్చింది. ఆయనపై సస్పెన్షన్ చెల్లదని చెపుతూ రద్దు చేయడమే కాకుండా తక్షణం విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. ఇది ఏపీ ప్రభుత్వానికి చెంపపెట్టే.

అయితే ఈ సందర్భంగా ఏబీ వెంకటేశ్వరావు అడిగిన కొన్ని సూటి ప్రశ్నలపై అధికారులు, ప్రజలు కూడా ఆలోచించ వలసిన అవసరం కనిపిస్తోంది. ఆయన ఏమడిగారంటే…

· ఏ శాడిస్ట్ బావ కళ్ళలో ఆనందం చూడటం కోసం కొందరు అధికారులు నాపై కక్ష కట్టారు?నిన్న నాకు జరిగింది రేపు మీకు జరగదని చెప్పగలరా?

· ఎటువంటి తప్పు చేయకపోయినా నన్ను సస్పెండ్ చేయడమే కాకుండా నాకు మతిస్థిమితం తప్పిందని ఈ ప్రభుత్వం దుష్ప్రచారం కూడా చేయించింది. ప్రభుత్వం కోసం పనిచేసే ఓ అధికారి పట్ల ఈవిదంగా ప్రవర్తించడం తగునా?

· నిబందనల ప్రకారం ఒక ఐపీఎస్ అధికారిని రెండేళ్ళకు మించి సస్పెండ్ చేయడానికి వీల్లేదు. ఈ విషయం చీఫ్ సెక్రెటరీ గా చేస్తున్న ఐఏఎస్ అధికారికి తెలియదా? ఒకవేళ తెలియకపోతే నేను చెప్పినప్పుడైనా ఆ తప్పును సరిదిద్దుకోవాలి కదా?

· చీఫ్ సెక్రెటరీ స్థాయిలో ముగియవలసిన ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం పంతానికి పోయి హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు తీసుకువెళ్ళి, కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేసి చివరికి ఏం సాధించింది? సుప్రీంకోర్టు చేత మొట్టికాయలు వేయించుకొంది. ఇంత కక్ష సాధింపు అవసరమా? .

· నాపై కక్షతో హైకోర్టులో, సుప్రీంకోర్టులో నన్ను దోషిగా నిలబెట్టడానికి ప్రభుత్వం కోట్లాది రూపాయల ప్రజాధనం విచ్చలవిడిగా ఖర్చు పెట్టింది. మీ కక్ష సాధింపు కోసం ప్రజాధనాన్ని ఖర్చు పెట్టే హక్కు మీకు ఎవరు ఇచ్చారు?ఈ ఖర్చుకు ఎవరు బాధ్యత వహిస్తారు?

· ప్రభుత్వంతో ఈ న్యాయపోరాటం చేయవలసిన అవసరమే నాకు లేదు కానీ పోరాడవలసి వచ్చింది. కనుక నా హైకోర్టు, సుప్రీంకోర్టు ఖర్చులన్నీ ప్రభుత్వమే నాపై తప్పుడు పిర్యాదులు వ్రాసిచ్చిన అధికారుల నుంచి వసూలు చేసి ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను.

· నాకు న్యాయపోరాటం చేయగల ఆర్ధికశక్తి ఉంది కనుక చేయగలిగాను. కానీ అది లేని వారి పరిస్థితి ఏమిటి? ప్రభుత్వం ఈవిదంగా వేదిస్తే మౌనంగా భరించాల్సిందేనా లేదా ప్రభుత్వ పెద్దలకు దాసోహం అయిపోవాలా?ఇలా చేస్తే ఇక వ్యవస్థలు కుప్పకూలిపోవా?