Andhra Pradesh -Supreme Court - YS Jaganఎలాగైనా ఎన్నికలు వాయిదా వెయ్యాలనే జగన్ ప్రభుత్వం కోరిక నెరవేరే చివరి అవకాశం కూడా పోయింది. సుప్రీం కోర్టులో ఈరోజు ప్రభుత్వం వేసిన పిటిషన్ విచారణకు వచ్చింది. అయితే ప్రభుత్వం లేవనెత్తిన ఏ ఒక్క అంశాన్ని కోర్టు పరిగణలోకి తీసుకోకుండా ఇందులో తాము జోక్యం చేసుకోబోమని చెప్పి కొట్టివేసింది.

రెండు వర్గాల వారు ఇగోకి పోవడం వల్ల రాష్ట్రంలో విచ్చలవిడితనం పెరుగుతుందని కోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వం చెప్పినట్టుగా కరోనా లేదా వ్యాక్సిన్ అనేది కారణంగా తమకు కనిపించడం లేదని ఇది నిమ్మగడ్డ రమేష్ తో ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది వల్లే అని తమకు అనిపిస్తుందని కోర్టు అభిప్రాయపడింది.

ఇంతకంటే కష్టమైన పరిస్థితులలో ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించారని కోర్టు గుర్తు చేసింది. ఈ తరుణంలో ఉద్యోగ సంఘాలు తమను కూడా ఈ పిటిషన్ లో తమను పార్ట్ చెయ్యాలని కోరాయి. అయితే ఈ సందర్భంగా కోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో మీ ప్రవర్తన దారుణంగా అలాగే అవాంఛనీయంగా ఉంది.

“అసలు ఎన్నికల అధికారి మీద మీడియా ముందు కామెంట్లు చెయ్యడం ఏంటి? ఎన్నికలకు వ్యతిరేకంగా తీర్మానాలు చెయ్యడం ఏంటి?, అంటూ వారి పిటిషన్ ని కనీసం పరిగణలోకి తీసుకోకుండానే పిటిషన్ ని కొట్టేవేశారు. ఏలిన వారిని ప్రసన్నం చేసుకోవడానికి రాజకీయాలకు దిగిన ఉద్యోగ సంఘాల నాయకులు ఇప్పటికైనా తమ తీరు మార్చుకుంటారేమో చూడాలి.