Deep-Down-the-Sushanth-Singh-Rajput's-Depression-Was--Shelved-Filmsబాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజపుట్ మృతి కేసు పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తాజాగా ఈ మృతి కేసులో సీబీఐ దర్యాప్తుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు వివరాలను సీబీఐకి అప్పగించాలని ముంబై పోలీసులను ఆదేశించింది. సీబీఐకి సహకరించాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించింది.

ముంబైలో జూన్‌ 14న బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి చెందిన విషయం తెలిసిందే. సుశాంత్ తండ్రి అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి ఆమె కుటుంబం తన కుమారుడిని ఆర్ధికంగా దోచుకుని మానసికంగా టార్చర్ పెట్టి అతని మృతి కారణం అయ్యారని ఆరోపిస్తున్నారు. కొందరు ఏకంగా దీంట్లో మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరే కు సంబంధం ఉందని ఆరోపిస్తున్నారు.

ఆదిత్య మహా సీఎం ఉద్ధవ్ కుమారుడు కావడంతో… ఒకవేళ అదే గనుక నిజమైతే మహారాష్ట్ర ని తిరిగి హస్తగతం చేసుకోవచ్చని బీజేపీ ఆరాటపడుతుంది. ఏదో విధంగా సుశాంత్ మృతి వెనుక ఉన్న అసలు కారణం బయటకు వచ్చి దోషులు శిక్షింపబడితే చాలని అభిమానులు కోరుకుంటున్నారు.

కొందరైతే మహా అయితే మహారాష్ట్ర బీజేపీకి చిక్కడంతప్ప ఇందులోని నిజాలు బయటకు రావని అభిప్రాయపడుతున్నారు. ఇది ఇలా ఉండగా… సుశాంత్ సింగ్ మృతిపై నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఉందని అత్యున్నత న్యాయస్థానం ఈ సందర్భంగా అభిప్రాయపడింది. ఈ క్రమంలోనే అన్ని అంశాలు బయటకు రావాలని చెబుతూ.. కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.