YS Jagan -Power purchase agreement -Supreme Court (2)అధికారంలోకి వచ్చిన నాటి నుండీ చంద్రబాబుని ఏదో ఒక విధంగా ఇరుకున పెట్టి జైలుకు పంపాలని కృత నిశ్చయంతో ఉన్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు(పీపీఏ)పై సమీక్ష చెయ్యాలన్న ప్రభుత్వం నిర్ణయానికి హై కోర్టు బ్రేకులు వేసింది. పీపీఏలపై ఆయా సంస్థలు దాఖలు చేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఇంధన శాఖ కార్యదర్శి జారీ చేసిన జీవో నంబర్‌ 63ను సవాల్‌ చేస్తూ విద్యుత్‌ సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి.

దీనిపై ఈరోజు విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. పీపీఏలను సమీక్షించేందుకు సంప్రదింపుల కమిటీని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్‌ 63ను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించింది. అలాగే విద్యుత్‌ సంస్థలకు ఏపీఎస్‌పీడీసీఎల్‌ రాసిన లేఖలనూ నాలుగు వారాల పాటు సస్పెండ్‌ చేసింది. చంద్రబాబు జమానాలో మార్కెట్ రేటు కంటే ఎక్కువకు విద్యుత్ ఒప్పందాలు జరిగాయని, రేట్లను వెంటనే తగ్గించాలని లేకపోతే పీపీఏలను రద్దు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ సంస్థలను హెచ్చరించింది.

అయితే రేట్లను నిర్ణయించడంలో రాష్ట్రప్రభుత్వ పాత్ర ఉండదని కేంద్రంతో పాటు విద్యుత్ సంస్థలు కూడా చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం వినలేదు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంలోని సంబంధిత శాఖ ఈ విషయంగా రాష్ట్ర ప్రభుత్వానికి రెండు సార్లు లేఖలు పంపింది. ఇటువంటి చర్యల వల్ల దేశంలో ఆ రంగంలోకి పెట్టుబడులు రావడం ఆగిపోతాయని హెచ్చరించింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబుని దోషిని చెయ్యడమే లక్ష్యంగా ముందుకు వెళ్ళింది. ఇక కేసు విషయానికి వస్తే తదుపరి విచారణను ఆగస్టు 22కు వాయిదా వేస్తూ దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.