Andhra Pradesh -Supreme Court - YS Jaganఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరో సారి చుక్కెదురు అయ్యింది. ఇంగ్లిష్‌ మీడియం అమలు విషయంలో హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ క్రమంలో ఎస్‌ఎల్‌పీ, స్టేపై ప్రతివాదులకు దేశ అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 25కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

సుప్రీం నుండి స్టే తెచ్చుకుని ఈ విద్యాసంవత్సరం నుండే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలన్న ప్రభుత్వ ఆకాంక్ష నెరవేరేలా లేదు. మాతృభాషలోనే విద్యాబోధన జరగాలన్న నిబంధన చట్టంలో లేదని, ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన జరగాలన్న ప్రభుత్వ నిర్ణయం ప్రగతిశీలమని, 94% తల్లిదండ్రులు తమ సర్వేలో అదే కోరుకున్నారని ప్రభుత్వం తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు.

అయితే ఈ దశలో స్టే ఇవ్వలేమని… సుప్రీం కోర్టు చెప్పింది. సహజంగా ప్రభుత్వ వాదనతో కోర్టు ఏ మాత్రం ఏకీభవించినా స్టే వచ్చేది… ఇప్పుడు ఈ కేసులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వ స్కూళ్ళలో రెండు మీడియంలలో బోధన చేసి, ఏది కావాలో నిర్ణయించుకునే ఆప్షన్ విద్యార్థులకు ఇస్తే ఈ సమస్య వచ్చేది కాదు.

ఒకవేళ నిజంగా 94% తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియం నే కోరుకుంటే… రెండు మూడు ఏళ్ళ లో డిమాండ్ లేదనే కారణంగా ఈ తెలుగు మీడియం స్కూళ్లను ప్రభుత్వం మూసివెయ్యచ్చు. అయితే తెలుగు మీడియం ఒప్పుకుంటే తాము వెనకడుగు వేసినట్టే అని ప్రభుత్వం ఇగోకి పోతుంది. ఇప్పుడు మొత్తంగా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టే ప్రక్రియే లేటు అవుతుంది. ఇగో రాజకీయాలలో నెగ్గుతుంది గానీ కోర్టులలో కాదని జగన్ గ్రహిస్తే మంచిది.