Supreme Court of India - Ayodhya Rama Janmabhoomi Case Judgement70 ఏళ్ళ నాటి రామజన్మభూమి – బాబ్రీ మసీద్ వివాదం ముగిస్తూ సుప్రీం కోర్టు కాసేపటి క్రితం చారిత్రాత్మక తీర్పు వెల్లడించింది. ఐదుగురు న్యాయమూర్తులు కలిగిన ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు ఇవ్వడం గమనార్హం. దాని ప్రకారం అయోధ్యలోని వివాదాస్పద కట్టడం ఉన్న స్థలం హిందువులదే. 2.77 ఎకరాల స్థలం హిందువులకే చెందుతుంది.

అదే సమయంలో అయోధ్యలో మసీదు నిర్మాణానికి ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం ఇవ్వాలి. మసీదు నిర్మాణానికి సున్నీ వక్ఫ్‌బోర్డుకు మూవుడు నెలలో 5 ఎకరాల స్థలం కేంద్రం లేదా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఇవ్వాలని కోర్టు తీర్పు చెప్పింది. వివాదాస్పద స్థలానికి సంబంధించి 3 నెలల్లో కేంద్రం ట్రస్ట్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. వివాదాస్పద స్థలాన్ని ట్రస్ట్‌ ఆధీనంలో ఉంచాలని సూచింది.

ఆలయ నిర్మాణం, ట్రస్ట్‌ విధి విధానాలపై 3 నెలల్లోగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. తీర్పు చెప్పే క్రమంలో వివాదాస్పద స్థలంలో ఒక్క కట్టడం ఉన్నట్టు పురావస్తు శాఖ నివేదికలు చెబుతున్నాయన్నారు. మసీదు నిర్మాణానికి ముందే ఆ స్థలంలో ఒక ఒక కట్టడం ఉందన్నారు. అయితే అది ఏ మతానిది అనేదాని పై స్పష్టత లేదు అంది.

రాముడు అయోధ్యలో జన్మించాడన్నది నిర్వివాదాంశమన్నారు. మసీదు ఎవరు కట్టారో, ఎప్పుడు కట్టారో స్పష్టం కాలేదని హైకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. రెండు మతాల వారు వివాదాస్పద స్థలంలో ప్రార్థనలు జరిపేవారని చెప్పారు. మొఘుళుల కాలం నుంచే హక్కు ఉన్నట్టు వక్ఫ్‌ బోర్డు నిరూపించలేకపోయిందన్నారు.