Supreme Court Fires Jayalalithaa, Supreme Court Fires Jayalalithaa karunanidhi Legal Case, Supreme Court Slams Jayalalithaa Karunanidhi Legal Caseతమిళ నాట నిజంగానే రసవత్తర రాజకీయం నడుస్తోంది. తనపై పరుష పదజాలంతో కూడిన విమర్శలు చేశారంటూ విపక్ష డీఎంకేకు చెందిన ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేయించిన అన్నాడీఎంకే అధినేత్రి, ఆ రాష్ట్ర సీఎం జయలలిత… కరుణానిధికి సవాల్ విసిరారు. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలంటూ జయ విసిరిన సవాల్ కు కరుణానిధి నుంచి ఇప్పటిదాకా సమాధానమే లేదు.

ఈ నేపథ్యంలో జయలలిత వ్యవహారంపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐదేళ్ల పాలనలో జయలలిత విపక్షంపై 150కి పైగా పరువు నష్టం దావాలను దాఖలు చేశారు. వీటిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం… సద్విమర్శలను ఎదుర్కోవడంలో తప్పులేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని జయలలితకు తలంటింది. అయినా రాజకీయాల్లో విమర్శలు అంతర్భాగమన్న విషయం తెలియదా? అంటూ కూడా కోర్టు జయ వైఖరిని నిలదీసింది.