telangana secretariatతెలంగాణలో పాత సచివాలయం కూల్చివేతకు అడ్డంకులు తొలగిపోయాయి. కూల్చివేతకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్. కూల్చివేతలపై దాఖలైన పిటిషన్‌లన్నీ న్యాయస్థానం కొట్టివేసింది. ఇప్పటికీ ఈ విషయంగా సుప్రీమ్ కోర్టులో దాఖలైన పిటిషన్లను కోర్టు కొట్టేసింది. పరిపాలనా విషయాలలో తాము జోక్యం చేసుకోబోమని తేల్చి చెప్పింది.

హైకోర్టులో సచివాలయ భవనాల కూల్చివేతకు కేంద్ర అనుమతులు అవసరం లేదని అసిస్టెంట్ సోలిసీటర్ జనరల్ తెలిపారు. కేవలం నూతన నిర్మాణాలు చేపట్టడానికి మాత్రమే అనుమతులు అవసరమని స్పష్టం చేశారు. మరోవైపు నూతన నిర్మాణాలు చేపట్టే ముందు అన్ని అనుమతులు తీసుకుంటామని అడ్వొకేట్ జనరల్ వెల్లడించారు.

ల్యాండ్ ప్రిపరేషన్‌లోనే భవనాల కూల్చివేత వస్తుందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ఇరు వాదనలు విన్న హైకోర్టు.. కేంద్ర పర్యావరణ అనుమతి అవసరం లేదన్న సోలిసీటర్ జనరల్ వాదనను హైకోర్టు ఏకీభవించింది. ప్రభుత్వం అన్ని అనుమతులు తీసుకున్నాకే కూల్చివేత పనులను చేపడుతుందని కోర్టు స్పష్టం చేసింది.

అయితే కరోనా సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని పనులు జరుపుకోవాలని కోర్టు సూచించింది. ఇది ఇలా ఉండగా… ఇప్పటికే 80% భవనాలను కూల్చివేత అయిపోయింది. ఇక మిగిలిన కూల్చివేతలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఆ పనులను మరింత వేగంగా పుంజుకోనున్నాయి. కొత్త సచివాలయానికి తొందరలో టెండర్లు పిలిచి ఏడాది లోపులో కేసీఆర్ కలల సౌధం నిర్మించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.