Supreme-Court-Raps-the-Center-for-Non-Implementation-of-Bifurcation-Promisesనాలుగేళ్లయినా ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని హామీలను ఎందుకు నెరవేర్చలేదని కేంద్రానికి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. విభజన హామీలు నెరవేర్చాలని కోరుతూ తెలంగాణ కాంగ్రెస్‌ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కాసేపటి క్రితం విచారణ చేపట్టింది.

ఇదే విషయంపై గతంలో జారీచేసిన నోటీసులకు కేంద్రం స్పందించకపోవడంపై జస్టిస్ సిక్రీ ధర్మాసనం కేంద్రప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే దీనిపై సవివరంగా వివరణ ఇచ్చేందుకు కేంద్రం నాలుగు వారాలు గడువు కోరింది. దీనికి అంగీకరిస్తూ ఈ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు నాలుగు వారాలు వాయిదా వేసింది.

దీనితో ఏపీ ప్రజలు ఆశలు కాస్త చిగురించాయి. నిర్దిష్టమైన కాలవ్యవధిలో విభజన హామీలు నెరవేర్చాలని కోర్టు ఉత్తరువులు ఇస్తే అది రెండు తెలుగు రాష్ట్రాలకు మేలు కలిగిస్తుంది. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ పిటీషన్ లో భాగస్థులయ్యి కోర్టులో కేంద్రం పై పోరాడితే కేసు మరింత వేగవంతంగా తేలే అవకాశం కనిపిస్తుంది.