Supreme Court Amaravati Inside tradingఒక కుక్కని చంపాలంటే దానిని పిచ్చి కుక్క అని ముద్ర వేస్తే సరిపోతుంది అంటారు. అలాగే రాజధానిని అమరావతి నుండి తరలించడానికి ఇన్సైడర్ ట్రేడింగ్ ని తెరమీదకు తెచ్చింది వైఎస్సార్ కాంగ్రెస్. అయితే ఇప్పటికే అసలు అమరావతికి ఇన్సైడర్ ట్రేడింగ్ కి సంబంధం లేదని ఏపీ హైకోర్టు సీఐడీ విచారణను నిలిపివేసింది.

తాజాగా దీనిపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుని ఆశ్రయించింది. ఆ కేసు వాదనలు వింటూ… ఇన్‌సైడర్ ట్రేడింగ్ వర్తించదని హైకోర్టు ఇచ్చిన ఆర్డర్‌లో తప్పేముందని సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.

రాజధాని అంశం బహిరంగ రహస్యమని హైకోర్టు చెప్పడంలో తప్పేముందని, భూములు అమ్మినవాళ్లు మోసపోయామని ఎక్కడైనా ఫిర్యాదు చేశారా? అని అడిగింది. నష్టం వచ్చిన వాళ్లే కోర్టును ఆశ్రయించాలి కానీ ప్రభుత్వానికి వచ్చిన నష్టమేంటని ధర్మాసనం ప్రశ్నించింది.

అయితే సుప్రీం కోర్టు ఈ కేసుని చూస్తున్న తీరుకు అలెర్ట్ అయిన సీనియర్ న్యాయవాది దుశ్యంత్ దావే మరిన్ని వాదనలు వినిపించడానికి సమయం కోరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు రానివ్వకుండా జాగ్రత్త పడినట్టుగా కనిపిస్తుంది. ఒకవేళ సుప్రీం కోర్టు ఇన్సైడర్ ట్రేడింగ్ లేదని తేల్చితే ఇక ప్రభుత్వం దగ్గర ఆప్షన్స్ ఉండవు.

రాజకీయంగా అది అత్యంత ఇబ్బందికరమైన విషయమే కాకుండా.. మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్న వారి వాదనలకు బలం చేకూరినట్టు అవుతుంది. అదే సందర్భంలో మూడు రాజధానులకు సంబంధించిన కోర్టు కేసులలో ప్రభుత్వానికి ఇది ఇబ్బందిగా మారొచ్చు.