Superstar Rajinikanthతన రాజకీయ ప్రవేశం గురించి గందరగోళాన్ని తొలగించడానికి సూపర్ స్టార్ రజనీకాంత్ సోమవారం తన మద్దతుదారులతో చెన్నైలో సమావేశం నిర్వహించారు. తన శ్రీ రాఘవేంద్ర కళ్యాణ మండపంలో జరిగిన సమావేశం తరువాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ… తన రాజకీయ ప్రవేశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటానాని అన్నారు.

రజనీకాంత్ 2017 డిసెంబరులో తన రాజకీయ ప్రవేశం గురించి సూచనలు ఇచ్చారు, కాని అప్పటి నుండి తన పార్టీ పేరును కూడా ప్రకటించలేదు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తుంది కాబట్టి, ఇప్పుడు ఆయన తుది నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఆరోగ్య కారణాలను చూపిస్తూ రజనీకాంత్ వెనక్కి తగ్గుతారని పుకార్లు ఉన్నాయి.

ఈ నాన్చుడు అభిమానులకు మరియు అతని మద్దతుదారులకు నిరాశపరిచింది. ఎన్నికలు వేగంగా సమీపిస్తున్నందున ప్రజలపై ముద్ర వేయడానికి ఆయనకు సమయం లేదని వారు భావిస్తున్నారు. రజనీకాంత్ రాజకీయాల పట్ల తన సీరియస్ నెస్ పై సందేహాలు రేకెత్తిస్తూ ఇన్నేళ్ళు నిరంతరం సినిమాలు చేస్తున్నారు.

2017 తరువాత ఆయన రజినీ మక్కల్ మందరంను మాత్రమే స్థాపించాడు. రాజకీయ పరివర్తన కోసం రజనీకాంత్ యొక్క అభిమానుల సంఘాలతో స్థాపించిన ఒక సంఘం. అయితే ఈ మూడు సంవత్సరాలలో ఏడాదికి ఒక సమావేశం చప్పున వారిలో వారు మాట్లాడుకోవడం మినహా పెద్దగా చేసింది ఏమీ లేదు.