superstar-rajinikanth-baasha-in-digital-5-1-surround-sound-talkకొన్ని సినిమాలు ఎన్ని సార్లు చూసినా ప్రేక్షకులకు బోర్ కొట్టవు. అలాంటి సినిమాల జాబితాలో ‘సూపర్ స్టార్’ రజనీకాంత్ “భాషా” సినిమా ఒకటని చెప్పకతప్పదు. బ్యాక్ గ్రౌండ్ లో దేవా అందించిన ‘భాషా… భాషా… భాషా…’ అన్న సౌండింగ్ రాగానే ధియేటర్లలో ప్రేక్షకులు విజిల్స్ తో మోతమోగించేసేవారు. 1995లో విడుదలైన ఈ సినిమా రజనీకాంత్ ‘సూపర్ స్టార్ డం’ను పతాక స్థాయికి తీసుకువెళ్ళింది. అప్పట్లో ఎవరి నోట విన్నా… నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్లే… అన్న డైలాగ్ వినపడేదని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

అలాంటి “భాషా” సినిమాను నేటి సాంకేతిక పరిజ్ఞానంకు అనుగుణంగా డిజిటల్ రూపంలోకి మారిస్తే ఎలా ఉంటుంది? అలాంటి ప్రయోగమే సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఆ దశలోనే ఉన్న చిత్ర యూనిట్, తాజాగా “భాషా” సినిమాకు సంబంధించి తొలి టీజర్ ను విడుదల చేసింది. అది కూడా రజనీ చెప్పిన పాపులర్ డైలాగ్ తో విడుదలైంది. డిజిటల్ గా రూపాంతరం చెంది 5.1 సరౌండింగ్ సౌండ్ సిస్టంతో సిద్ధమవుతున్న కొత్త వర్షన్ ను చూడాలంటే కొంత సమయం పడుతుంది గానీ, అప్పటివరకు శాంపిల్ గా ఈ టీజర్ ను వీక్షించవచ్చు.