మంచి సినిమాలపై ప్రశంసలు కురిపిస్తూ, తనదైన అనుభూతులను తెలియజేయడం ఇటీవల కాలంలో మహేష్ బాబుకు చాలా రొటీన్ గా మారిన విషయం. బాక్సాఫీస్ వద్ద కళకళలాడే సినిమాను వీక్షించి, ఓ మినీ రివ్యూ మాదిరి చెప్పే మహేష్ ట్వీట్స్ కోసం ఇతర హీరోల అభిమానులు కూడా ఎదురు చూస్తుంటారు.
ఆ క్రమంలోనే ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోన్న “ఆర్ఆర్ఆర్” సినిమాపై తన భావాలను పంచుకున్నారు మన సూపర్ స్టార్. “ఆర్ఆర్ఆర్” ఓ ఎపిక్. సినిమాలు ఉంటాయి, ఎస్.ఎస్. రాజమౌళి సినిమాలు ఉంటాయి, గ్రాండ్ విజువల్స్, మ్యూజిక్, ఎమోషన్స్ అన్ని కూడా ఊపిరి సలపని ఊహలకు అతీతంగా ఉన్నాయి, సింపుల్ గా చెప్పాలంటే స్టన్నింగ్ అంటూ చెప్పుకొచ్చారు.
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు వారి స్టార్ డమ్ లకు అతీతంగా ఎదిగారు. ప్రపంచమంతా అబ్బురపరిచే విధంగా అభినయాన్ని ప్రదర్శించారు. నాటు నాటు పాటకు గురుత్వాకర్షణ సిద్ధాంతం పనిచేసినట్లుగా లేదు. నిజంగా మీ ఇద్దరూ గాల్లో ఎగురుతున్నట్లుంది అంటూ ఒక సహజ అభిమాని చెప్పినట్లుగా తనదైన పరిభాషలో మహేష్ చెప్పిన విధానం బహుశా చెర్రీ – తారక్ ఫ్యాన్స్ కు ‘గూజ్ బంప్స్’ ఇచ్చి ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు.
“ఆర్ఆర్ఆర్” టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు తెలిపిన మహేష్, ఈ ప్రాజెక్ట్ ను చూసి తాను ఎంతో గర్విస్తున్నట్లుగా పేర్కొన్నారు. తెలుగు సినిమా ఖ్యాతి రెపరెపలాడిన ప్రతిసారి మహేష్ తన నిష్కల్మషమైన అభిమానాన్ని ప్రదర్శించడం గొప్ప విషయం. ఇతర హీరోలు కూడా ‘ఆర్ఆర్ఆర్’ పట్ల తమ భావాలను పంచుకున్నారు గానీ, మహేష్ చెప్పిన వైనం మాత్రం స్పెషల్ కదా!
There are films and then there are SS Rajamouli films! #RRR E.P.I.C!! The scale, grandeur visuals, music & emotions are unimaginable, breathtaking and simply stunning!
— Mahesh Babu (@urstrulyMahesh) March 26, 2022
Rashmika Gets Uncomfortable at Private Party
Senior Actor Vexed With Pawan Kalyan!