Superstar Krishna - Title logo Bharat anu Nenu, Spyder Mahesh Babuసూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు నాడు తన సినిమాలకు సంబంధించి పోస్టర్స్ ను, టీజర్స్ ను ప్రిన్స్ మహేష్ బాబు విడుదల చేయనుండడం ‘దూకుడు’ సినిమా దగ్గర నుండి ఆనవాయితీగా మారింది. అవకాశం ఉన్నంత వరకు ఫస్ట్ టీజర్ ను మే 31వ తేదీనే విడుదల చేయడానికి ప్లాన్ చేస్తుంటారు. ఆ క్రమంలోనే తాజాగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న “స్పైడర్” టీజర్ కూడా విడుదల కాబోతోంది. దీంతో ప్రిన్స్ అభిమానులంతా ఆ క్షణం కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.

అయితే తాజాగా అందుతున్న మరో ట్విస్ట్ ఏమిటంటే… సోమవారం నాడు షూటింగ్ ప్రారంభమైన “భరత్ అనే నేను” సినిమాకు సంబంధించిన ‘టైటిల్ లోగో’ను మే 31వ తేదీ నాడే ఆవిష్కరించబోతున్నారు. అన్ని అనుకున్నట్లు కుదిరితే ఇది సూపర్ స్టార్ కృష్ణ చేతుల మీదుగానే విడుదల కానుందని సమాచారం. ఈ రెండు స్పెషల్స్ తో పాటు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కబోయే మహేష్ బాబు 25వ సినిమాకు సంబంధించి ఓ ‘సర్ ప్రైజ్’ ఉండనుందని ట్రేడ్ వర్గాలలో చర్చ జరుగుతోంది. దీంతో కృష్ణ పుట్టినరోజును ఘనంగా జరుపుకునేందుకు ఘట్టమనేని అభిమానులు నిరీక్షిస్తున్నారు.