BA raju industry hitతెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ పిఆర్వోగా కొనసాగుతున్న బిఎ రాజు జన్మదినం ఈ రోజు. ఈ సందర్భంగా “ఇండస్ట్రీ హిట్.కాం” అనే కొత్త వెబ్ సైట్ ను ప్రారంభించారు. దీంతో టాలీవుడ్ ప్రముఖ తారాలోకం మొత్తం బిఎ రాజుకు జన్మదినోత్సవం చెబుతూ సదరు ‘వెబ్ సైట్’ను ప్రచారం చేస్తున్నారు.

ఈ జాబితాలో ప్రిన్స్ మహేష్ బాబు నుండి అక్కినేని అఖిల్ వరకు దాదాపుగా అందరూ ఉన్నారు. అన్ని వర్గాల వారికి మిక్కిలి సన్నిహితంగా ఉండడంతో బిఎ రాజుకు ప్రముఖులందరి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ‘సూపర్ హిట్’ మ్యాగ్ జైన్ అధినేతగా గతంలో ‘సూపర్ హిట్.కాం’ అనే వెబ్ సైట్ ను బిఎ రాజు నడిపారు.

ఎప్పటికప్పుడు తాజా కలెక్షన్స్ ను రిపోర్ట్ చేయడంతో అప్పట్లో సదరు వెబ్ సైట్ బాగానే హల్చల్ చేసింది. అయితే కొన్ని సంవత్సరాలుగా ‘అప్ డేట్స్’కు దూరంగా ఉంటున్న సదరు ‘వెబ్ సైట్’కు కొనసాగింపే ఈ “ఇండస్ట్రీ హిట్.కాం” అని సినీ వర్గీయులు అభిప్రాయ పడుతున్నారు.