super-insult-pakistan-defence-ministers-pants-go-down-in-publicమొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న భారత్ పై రెచ్చగొట్టుడు వ్యాఖ్యానాల పర్యవసానాలు ఎలా ఉంటాయో బుధవారం నాటి నుండి పాక్ రుచిచూస్తోంది. దీంతో పరువు నిలుపుకోవడం కోసం నానా తంటాలు పడుతోంది పాక్. ఓ సారి అసలు దాడి జరగలేదు అని చెప్తే, మరోసారి ఇద్దరు చనిపోయారు, ఇంకోసారి ఇండియా దాడిని ఖండిస్తున్నాం… అంటూ రకరకాల ప్రకటనలు చేస్తోంది. దీనిపై అవాక్కయ్యే విషయం ఏమిటంటే… భారత్ దాడి చేసిన దృశ్యాలను పాకిస్తాన్ లోకల్ మీడియా ఛానల్స్ ప్రసారం చేయడంతో పాక్ బూటకపు వైఖరి మరోసారి బయటపడినట్లయ్యింది.

ఇదిలా ఉంటే, భారత్ ప్రతీకార చర్యలకు పాకిస్తాన్ రక్షణ మంత్రి క్వాజా మహ్మద్ ప్యాంట్ ఊడిపోయిందంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయు, సైనిక బలగాలు మెరుపుదాడులు చేసి 38 మంది ముష్కరులను హతమార్చారని తెలియగానే… పాకిస్థాన్ రక్షణ మంత్రి ప్యాంటు వీడిపోయిందని పేర్కొంటూ ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అయితే దీని వెనుక అసలు వాస్తవం గమనిస్తే…

ఇది పాత వీడియోనే. ఏదో సందర్భంలో అతిథులను ఆహ్వానిస్తున్న ఖ్వాజా మహ్మద్ ప్యాంటు అనుకోకుండా ఊడిపోయింది. దీంతో తీవ్ర అవమానానికి గురైన ఆయన ప్యాంట్ ను సరిచేసుకున్నారు. అయితే ఈ అవకాశాన్ని నెటిజన్లు ఇండియా రివెంజ్ కు వాడేసుకున్నారు. ఒంటి మీద ప్యాంట్ కాపాడుకోలేని మంత్రి అణ్వస్త్రాలు వేస్తామంటూ భారత్‌ ను బెదిరిస్తున్నాడంటూ ఎద్దేవా చేస్తున్నారు. మరో విశేషమేమిటంటే… భారత్ తో పాటు పాక్ మీడియాలో కూడా ఈ వీడియో సర్క్యూలేట్ అవుతుండడం. ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..!