One Night Stand Trailerబాలీవుడ్ లో మల్లికా షెరావత్ ‘మర్డర్’ సినిమా సృష్టించిన సంచలనం తెలిసిందే..! తనకు వివాహమైన తర్వాత పాత స్నేహితునితో లైంగిక సంబంధం పెట్టుకుని ‘మర్డర్’ సినిమాకు హాట్ హాట్ గా మార్చేసింది. అప్పటికి బాలీవుడ్ ప్రేక్షకులకు కొత్తదనం కావడంతో సినీ అభిమానులు ‘మర్డర్’ను ఆదరించారు. అయితే దాదాపుగా అదే స్టోరీని కాస్త అటు ఇటుగా చేసి సన్నీలియోన్ తో “వన్ నైట్ స్టాండ్” అనే సినిమాకు తెరకెక్కించినట్లుగా ధియేటిరికల్ ట్రైలర్ స్పష్టం చేసింది.

సన్నీలియోన్ వెండితెరపై ప్రదర్శించే అందాలే హైలైట్ గా ఈ సినిమా రూపుదిద్దుకుందని ట్రైలర్ క్లారిటీ ఇచ్చేసింది. సన్నీ శృంగార సన్నివేశాలతో రసిక హృదయాలను ఆకట్టుకునే విధంగా చేసిన ప్రయత్నం సఫలీకృతం అయ్యిందో లేదో తెలియాలంటే సినిమా విడుదల కాబోయే ఏప్రిల్ 29వ తేదీ వరకు వెయిట్ చేయాలి. ఎన్ని అందాలు ఆరబోసినా ఇప్పటివరకు తనకు బ్రేక్ లభించకపోవడంతో “వన్ నైట్ స్టాండ్”లో సన్నీ మరింతగా రెచ్చిపోయిందని బాలీవుడ్ వర్గాల టాక్.