Sunny Leone Kerela ‘పోర్న్ బ్యూటీ’ సన్నీలియోన్ కు యూత్ లో ఉన్న క్రేజ్ ఏమిటో తెలియనిది కాదు. ఈ ముద్దుగుమ్మ అంటే కుర్రకారుకు వీరపిచ్చి ఉందన్న తెలిసిందే కానీ, మరీ ఫ్లెక్సీలు చించేసి ఫోటోలు తీసుకునేటంత ఉందన్న విషయం మాత్రం తెలియదు. తాజాగా కేరళలోని కొచ్చిలో అడుగుపెట్టిన సన్నీలియోన్ కు అభిమానులు అదిరిపోయే షాక్ ఇచ్చారు. బహుశా నిర్వాహకులు కూడా ఇంతమంది అభిమానులు పోటెత్తుతారని ఊహించి ఉండకపోవచ్చు. కానీ ఈ అభిమానం చూసి ముగ్దురాలయ్యింది సన్నీ.

ఈ ఈవెంట్ కు సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ… జనమనే సముద్రంలో తన కారు ఎలా చిక్కుకుపోయిందో చూడండి అంటూ షేర్ చేసుకుంది. ఇక నెట్టింట వైరల్ గా మారింది మాత్రం మరో పిక్. స్టేజ్ పైన సన్నీలియోన్ ఉన్నపుడు ఆమెను తన కెమెరాలో బంధించేందుకు ఓ అభిమాని తనకు అడ్డుగా ఉన్న ఫ్లెక్సీని చించి, సన్నీని షూట్ చేయడానికి ప్రయత్నించాడు. ఇండియాలో స్టార్ హీరోలకు కూడా ఈ రేంజ్ లో క్రేజ్ ఉండకపోవడంతో, ఈ ఫోటో కాస్త వైరల్ అవుతోం