sunny leone husband hospitalisedఓ వైపు “మస్తీజాదే” ట్రైలర్ తో ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఊపేస్తున్న ‘పోర్న్’ బ్యూటీ సన్నీలియోన్ మరోవైపు భర్త డానియెల్ వెబెర్ కు సేవలు చేస్తోంది. గొంతు సంబంధిత వ్యాధి ‘టోంసిల్లిటిస్’తో బాధపడుతున్న డానియెల్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

గొంతు నొప్పి ఎక్కువగా ఉండడంతో హాస్పిటల్ కు తీసుకువెళ్ళామని, వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ‘టోంసిల్లిటిస్’గా గుర్తించి చికిత్స చేస్తున్నారని, ప్రస్తుతం డానియెల్ ఆరోగ్యం మెరుగవుతోందని, త్వరలోనే డిశ్చార్జ్ అవుతాడని ముద్దుగుమ్మ సన్నీ చెప్పుకొచ్చింది.

బాలీవుడ్ హాటెస్ట్ కపుల్స్ గా సన్నీ – డానియెల్ ల పేర్లు ఎప్పుడూ వార్తల్లో ఉంటాయి. అయితే ఈ సారి మాత్రం కాస్త డిఫరెంట్ గా హాస్పిటల్ కేంద్రంగా వినపడుతున్నాయి. అదే కదా సన్నీ స్పెషాలిటి! ‘పోర్న్’ బ్యూటీ సంగతులు ఎక్కడ ఉన్నా… మీడియా వర్గాలకు అవి హాట్ టాపిక్కే కదా!