Sunny Leone Biopic in troubelహాట్ బ్యూటీ సన్నీలియోన్‌ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన వెబ్ సిరీస్ “కరణ్‌జిత్ కౌర్: ది అన్‌ టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీలియోన్”కు ఆదిలోనే కష్టాలు మొదలయ్యాయి. ఈ టైటిల్‌ విషయంలో శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్‌జీపీసీ) అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. టైటిల్‌లో ‘కౌర్’ను అంగీకరించే ప్రసక్తే లేదని, తొలగించాలని అల్టిమేటం జారీ చేసింది.

‘కౌర్’ను ఉపయోగించడం వల్ల సిక్కుల మనోభావాలు దెబ్బతింటాయని ఎస్‌జీపీసీ అడిషనల్ సెక్రటరీ, అధికార ప్రతినిధి దల్జీత్ సింగ్ బేడీ అన్నారు. సన్నీలియోన్ సిక్కు మత విశ్వాసాలను పాటించడం లేదని, కాబట్టి ఆ పేరును ఉపయోగించడం తగదన్నారు. అసలా పదాన్ని ఉపయోగించే హక్కే ఆమెకు లేదని కుండబద్దలుగొట్టారు.

సిక్కు గురువులు ఇచ్చిన ‘కౌర్’ అనే పదం చాలా పవిత్రమైనదని ఆయన పేర్కొన్నారు. సిక్కు బోధనలను పాటించని వారికి ఆ పదాన్ని ఉపయోగించుకునే అర్హ త లేదన్నారు. ఈ పదాన్ని ఉపయోగించడం సిక్కులెవరూ హర్షించరన్నారు. సన్నీలియోన్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.