sunil second inningsసినిమాల్లో కామెడీ కి ఎంత ప్రాధాన్యత ఉంటుందో మనకు అందరికీ తెలిసిందే. ఇంకా చెప్పాలి అంటే, బిజీ బిజీగా గడుపుతున్న ఈ జీవితాల్లో ఒక గంట పాటు ఆనందాన్ని పంచుతున్న వారం వారం వచ్చే ‘జబర్దస్త్’ కార్యక్రమాలు, ఆయా కార్యక్రమాలకు వస్తున్న రేటింగ్స్ చెప్తాయి, కామెడీకి మన ప్రేక్షకులు ఎంత ప్రాధాన్యత ఇస్తారో. మరి అలాంటి మూడు గంటల సినిమాలో కామెడీ అంటే ఇక నాన్ స్టాప్ ఎంటర్‌టేన్‌మెంట్ అంటే ఆ రూటే సేపరేటు అనుకోవాలి ఇదిలా ఉంచి అసలు మ్యాటర్ లోకి వెళితే, కమీడియన్ సునీల్, అలియాస్ హీరో సునీల్.

సినిమా జీవితాల్లో ఎత్తు పల్లాలు సర్వ సాధారణం అని చెప్పడానికి ఈ హీరో జీవితమే ఒక ఉదాహరణ, ఎందుకంటే కమీడీయన్ గా కరియర్ మంచి పీక్స్ లో ఉన్న టైమ్ సునీల్ హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుని కొంత మేరకు సక్సెస్ అయ్యాడు అనే చెప్పాలి. కానీ సినిమాల ఫ్లాపులు ఆయన్ని పలకరించడం మొదలు పెట్టాక కానీ ఆయనకు అర్ధం కాలేదు సునీల్ ఫ్యూచర్ ఏమవయిపోతుందో అని. సరే అవన్నీ కాదు, ఈ హీరో పాత్రలు చేసి చేసి హిట్స్ రాక అలసిపోయి మళ్లీ కమీడీయన్ గా సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు సునీల్. అయితే ఇప్పుడు ఆ సెకెండ్ ఇన్నింగ్స్ పైన కూడా నీలి మబ్బులు కమ్ముకున్నాయి అని తెలుస్తుంది. తాను ఆశించిన విధంగా ఈ ఇన్నింగ్స్ ముందుకు సాగడం లేదు అన్నది ఒప్పుకుని తీరాల్సిన విషయమే. సునీల్ మళ్లీ కమీడీయన్ గా మారి చేసిన సిల్లీ ఫెలోస్, ఓవర్‌సీస్ కాదు కదా కనీసం గల్లీల్లో కూడా ఆయన్ని గట్టెకించలేదు.

ఇక ఆప్త మిత్రుడు అయినటువంటి మాటల మంత్రికుడు త్రివిక్రమ్ అయినా ఆయనకు బ్రేక్ ఇస్తాడు ఏమో అనుకుంటే, అరవింద సమేతలో, పాత్ర అయితే మంచి మార్క్స్ పదే పాత్ర ఇచ్చాడు కానీ, సునీల్ కామెడీ చేసే అవకాశం మాత్రం ఇవ్వలేదు. ఇక ఈ రెండు కాదులే అని రవి తేజా ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన సినిమా అయితే ‘అమర్ అక్బర్ అంటోనీ’ బేబీ సిట్టర్ బాబ్జీగా రూపం ఎత్తినా ఆ పాత్ర వర్క్ ఔట్ అయితే అయ్యింది కానీ, ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోవడం గమనార్హం. మొత్తంగా చూసుకుంటే మాత్రం సునీల్ ఎంచుకుంటున్న పాత్రలో తప్పులు చేస్తున్నాడో. లేక మరో విధమైన తప్పటడుగులు వేస్తున్నాడో తెలీదు కానీ, మొత్తం మీద సునీల్ సెకెండ్ ఇన్నింగ్స్ అంత సక్సెస్ఫుల్ గా లేదు అని చెప్పాలి. మరి ఏదో ఒక జాక్‌పాట్ తగిలితే తప్పా, సునీల్ మళ్లీ కోల్పోయిన ఫార్మ్ ను తిరిగి పొందలేడు అన్నది సినిమా వర్గాల నుంచి వినిపిస్తున్న చేదు నిజం. మరి చూద్దాం ఏం జరగబోతుందో.