Sunil Role Revealed in NTR -Trivikram Movieమాటల మాంత్రికుడు త్రివిక్రమ్-యంగ్ టైగర్ జూనియర్ ఎన్‌టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాలో కమెడియన్ సునీల్ ఏ పాత్ర చేయనున్నాడో తెలిసిపోయింది…! ఇందులో సునీల్ ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. ఆ పాత్ర ఏంటనేది తాజాగా బహిర్గతమయింది.

ఈ చిత్రంలో సెక్యూరిటీ ఆఫీసర్‌‌గా సునీల్ నటించనున్నాడట. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ‘అజ్ఞాతవాసి’ చిత్రం తీవ్ర నిరాశను మిగల్చడంతో ఈ సినిమాని దర్శకుడు త్రివిక్రమ్ చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందులోని పాత్రల డిజైన్‌పై ఆయన దృష్టి సారించినట్లు సమాచారం.