Sunil Chiranjeevi, Sunil Chiranjeevi 150th Movie, Sunil Role Chiranjeevi 150th Movie, Sunil Character Chiranjeevi 150th Movie, Comedian Sunil Chiranjeevi 150th Movieపరిపూర్ణ హీరోగా మారిన తర్వాత సునీల్ వేసిన కామెడీ వేషాలు బహు అరుదు. 2010లో విడుదలైన ‘మర్యాద రామన్న’ తర్వాత ఏవో ఒకటి, అర ‘ఖలేజా’ వంటి సినిమాలలో మాత్రమే సునీల్ కమెడియన్ గా కనపడ్డారు. అయితే కాలక్రమేణా కమెడియన్ రోల్స్ ‘జీరో’ స్థాయికి పడిపోయాయి. మరి దీనికంతటికి కారణం… కమెడియన్ గా తనకు వస్తున్న అవకాశాలను సునీల్ ఒప్పుకోకపోవడమనేది ప్రధాన కారణంగా ట్రేడ్ వర్గాల్లో హల్చల్ చేసే సమాచారం తెలిసిందే.

అయితే సునీల్ వెర్షన్ మరో విధంగా ఉంది. ‘నోట్ దిస్ పాయింట్… ప్లీజ్… హీరోగా మారిన తర్వాత కమెడియన్ వేషాలు వేయను అని నేను ఎప్పుడూ చెప్పలేదు… ‘అందాల రాముడు’ సినిమాతో హీరోగా మారిన తర్వాత కూడా అయిదేళ్ళ పాటు కమెడియన్ గా కొనసాగానన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసాడు సునీల్. ఇటీవల వచ్చిన మెగాస్టార్ 150వ సినిమాలో కమెడియన్ గా వచ్చిన అవకాశంపై కూడా స్పందించారు.

‘తానే చిరంజీవి గారి 150వ సినిమాలో అవకాశం ఇవ్వమని అడిగానని, అయితే ముందుగా అనుకున్న రోల్ చేయలేకపోయానని, అయితే ఏదొక కామెడీ పాత్ర మాత్రం ఖచ్చితంగా చేస్తానని’ హామీ ఇచ్చాడు సునీల్. తన వద్దకు హీరో పాత్రలే వస్తున్నాయని, అందుకే కమెడియన్ గా కనపడలేకపోతున్నానని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు ‘జక్కన్న.’