sunil next movie title jakkannaదర్శకధీరుడు రాజమౌళిని టాలీవుడ్‌ జక్కన్న అని కూడా పిలుస్తారు అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అమర శిల్పి జక్కన్న ఏ చిన్న శిల్పాన్ని అయినా కూడా ఎంతో ఓపికతో, నెమ్మదిగా చెక్కేవాడు. అలాగే రాజమౌళి కూడా అది ఎంత చిన్న సీన్‌ అయినా ఎంతో జాగ్రత్తగా, ఎంతో ఓపికగా తెరకెక్కిస్తాడు. అందుకే రాజమౌళి సీరియల్స్‌ తీసే సమయంలోనే ఈ జక్కన్న బిరుదును పొందాడు. అంతటి గొప్ప దర్శకుడు బిరుదును టైటిల్‌గా ఉపయోగించుకుని కామెడీ హీరో సునీల్‌ ఒక సినిమా చేసేందుకు సిద్దం అవుతున్నాడు.

సునీల్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కృష్ణాష్టమి’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఆ సినిమా విడుదల అవ్వడమే ఆలస్యం తన తర్వాత సినిమాను వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో చేసేందుకు సునీల్‌ కమిట్‌ అయ్యాడు. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతున్న ఆ సినిమాకు ‘జక్కన్న’ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. ఈ సినిమాలో సునీల్‌ జక్కన్నగా కనిపిస్తాడు అంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇక ఈ సినిమాలో సునీల్‌ మరోసారి సిక్స్‌ ప్యాక్‌లో కనిపిస్తాడు అంటూ ప్రచారం జరుగుతోంది.