Jakkanna Trailer, Sunil Jakkanna Trailer, Jakkanna Trailer Talk, Jakkanna Movie Trailer, Sunil Next movie Jakkanna, Jakkanna Trailer Review‘బ్యాక్ టు ఎంటర్టైన్’ అంటూ మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసిన కామెడీ చిత్రాల హీరో “జక్కన్న” ధియేటిరికల్ ట్రైలర్ విడుదలైంది. సినిమా టైటిల్ కు ఉన్న ఉపశీర్షిక పేరులోనే ఉంది గానీ, ట్రైలర్లో ఎక్కడా కనపడకపోవడం విశేషం. అయితే నవ్వించాలనే ప్రయత్నం మాత్రం ప్రతి సీన్లోనూ కనపడుతోంది. ‘30 ఇయర్స్ ఇండస్ట్రీ’ పృధ్వీ చెప్పిన ఓ రెండు డైలాగ్ లు మినహా ప్రేక్షకులను నవ్వు తెప్పించే సన్నివేశాలు లేకపోవడం అతి పెద్ద మైనస్.

వీక్షించడానికి సునీల్ లుక్ బాగానే ఉన్నప్పటికీ, ఒక హీరోగా ప్రేక్షకులకు అందివ్వాల్సిన ‘ఎంటర్టైన్మెంట్’లోనే ఎక్కడో లోపం ఉన్నట్లు కనపడుతోంది. హీరోయిన్ మనరా చోప్రా గ్లామరస్ గా అందాల విందు చేసిందని ట్రైలర్ స్పష్తం చేసింది. ఇక, సాంకేతిక విభాగాలన్నీ ఉన్నత స్థాయిలోనే ఉండగా, ప్రేక్షకులకు చెప్పాలనుకున్న కధ విషయంలోనే ట్రైలర్ సరిగా కట్ చేసినట్లు కనపడలేదు.

రాజమౌళి ముద్దు పేరు అయిన “జక్కన్న” టైటిల్ కావడంతో అన్ని వర్గాల ప్రేక్షకుల్లోకి టైటిల్ ఇప్పటికే చొచ్చుకుపోగా, మరి ‘జక్కన్న’గా రాబోతున్న సునీల్ ఏం చేస్తాడో తెలియాలంటే మరికొద్ది కాలం వెయిట్ చేయాలి. దినేష్ సంగీతం అందించగా, వంశీ కృష్ణ ఆకెళ్ళ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.