‘జక్కన్న’ సినిమా ద్వారా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సునీల్, నవ్వించడంలో మరోసారి విఫలమైన విషయం తెలిసిందే. ప్రేక్షకుల స్పందన ఎలా ఉన్నా, కలెక్షన్స్ వచ్చాయి కాబట్టి ‘జక్కన్న’ హిట్టే అని సునీల్ చెప్తుండగా, మరో సినిమా ఈ సెప్టెంబర్ లో “ఈడు గోల్డ్ ఎహే” సినిమాతో మళ్ళీ ఆడియన్స్ ని పలకరించబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన తొలి టీజర్ ను చిత్ర నిర్మాణ సంస్థ విడుదల చేసింది.
సునీల్ తో పాటు చిత్ర ప్రధాన తారాగణం అంతా కనపడిన ఈ టీజర్ లో ‘ఎంటర్టైన్మెంట్’ పాళ్ళు ఎక్కువగా ఉన్నట్లు కనపడుతోంది. 30 ఇయర్స్ పృధ్వీ, వెన్నెల కిషోర్, సప్తగిరి, ప్రభాస్ శీను, షకలక శంకర్ తదితర కమెడియన్లతో సాగిన సీన్లు, మణిశర్మ తనయుడు మహతి అందించిన బ్యాక్ గ్రౌండ్ సంగీతం, దర్శకుడు వీరూ పోట్ల డైలాగ్స్ అండ్ టేకింగ్, “ఈడు గోల్డ్ ఎహే” టీజర్ కు ప్లస్ పాయింట్స్.
కామెడీ జోనర్ లోనే సినిమాలు చేస్తున్నా, ప్రేక్షకులను నవ్వించడంలో సక్సెస్ కాలేకపోతున్న సునీల్, ఈ సినిమాతో అయినా, కమర్షియల్ సక్సెస్ కాకుండా, ప్రేక్షకులు ఇచ్చే నిజమైన సక్సెస్ ను అందుకుంటాడేమో చూడాలి. ‘రగడ’ ఫేం దర్శకుడు వీరూ పోట్ల తెరకెక్కించిన ఈ సినిమా కూడా రొటీన్ ఫ్లిక్ గా కనపడుతున్నా, సినిమాలో ‘ఎంటర్టైన్మెంట్’ పండితే సునీల్ ఖాతాలో సక్సెస్ పడ్డట్లే!