Sundeep_Kishan_accidentఇటీవలే ‘ఒక్క అమ్మాయి తప్ప’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యువ హీరో సందీప్ కిషన్ కు ఈ సినిమా ఫలితం కూడా చేదు అనుభవాన్నే మిగిల్చింది. తొలిరోజు పర్వాలేదనిపించే కలెక్షన్స్ ఉన్నప్పటికీ, ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సినిమా విఫలం కావడంతో, నిరాశలో ఉన్న సందీప్ కిషన్, ప్రస్తుతం క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు.

పోలీస్ కానిస్టేబుల్ పాత్ర పోషిస్తున్న సందీప్ కిషన్ పై యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుపుతుండగా, హఠాత్తుగా జారి కిందపడడంతో గాయాల పాలయ్యారు. ఈ ప్రమాదంపై సందీప్ తెలుపుతూ… “ప్రస్తుతం పర్వాలేదని, కొన్ని కుట్లు పడ్డాయని, దురదృష్టవశాత్తూ సంఘటనగా అభివర్ణించిన సందీప్, సన్నివేశం అయితే చాలా బాగా వచ్చినందుకు సంతోషంగా ఉందని” ట్వీట్ చేసారు.

తనకు గాయం జరిగినా, సీన్ బాగా వచ్చిందని చెప్తూ తన డెడికేషన్ ను సందీప్ చాటుకోగా, ఒక్క విజయం కోసం పరితపిస్తున్న సందీప్ కు కృష్ణవంశీ అయిన ఆశించిన ఫలితాన్ని అందిస్తారేమో చూడాలి. ఈ సినిమాలో ‘లిప్ లాక్’ల సుందరి రేజీనా హీరోయిన్ గా నటిస్తోంది.