sumantha-reveal-ys-jagan-wall-storyఓ పక్కన అక్రమాస్తుల కేసులను ఎదుర్కొంటూ, మరో పక్కన వైసీపీ అధినేతగా రాజకీయ రంగంలో ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి… తన సినిమాలు తానూ చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్న హీరో సుమంత్ కు మధ్య సంబంధాలు ఏంటి అనుకుంటున్నారా? ఉందండోయ్… అది కూడా ఈనాటి అనుబంధం కాదు. దాదాపుగా 25 ఏళ్ళ క్రితం నాటి బంధం. ఇప్పుడు ఇది ఎలా బయటకు వచ్చింది అనుకుంటున్నారా? స్వయంగా హీరో సుమంతే, వైఎస్ జగన్ తో ఉన్న అనుబంధం గురించి వివరించారు.

చాలా మందికి తెలియని ఈ విషయాన్ని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపిన సుమంత్… “జగన్, తానూ మంచి మిత్రులమని, ఇద్దరం ఒకే క్లాసు, ఒకే బెంచీలో కూర్చుని చదివామని, అలాగే కలిసి అల్లరి చేసేవాళ్ళమని, రాత్రి పొద్దు పోయే వరకు కలిసి తిరిగేవాళ్ళమని” తన చిన్ననాటి మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. అయితే ఇదంతా దాదాపుగా 25 ఏళ్ళ క్రితం నాటి సంఘటనలుగా చెప్పిన సుమంత్, ఓ అరుదైన సంఘటనను కూడా గుర్తు చేసుకున్నారు.

ఓ రోజు జగన్ తమ ఇంట్లోనే ఉండాల్సి రాగా, పైనున్న రూమ్ కు తాము దొంగతనంగా వెళ్లేందుకు మొదటగా తానూ గ్రిల్ పట్టుకుని ఎక్కుతుండగా, తాతయ్య నాగేశ్వరరావు గారు చూడడంతో అడ్డంగా దొరికిపోయామని, ఆ సమయంలో ఆ గ్రిల్ ను పట్టుకుని తానూ వ్రేలాడుతూనే… ‘ఇతని పేరు జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు’ అంటూ పరిచయం చేసానని, అప్పట్లో జగన్, తానూ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళమని సుమంత్ చెప్పిన సంగతులు సోషల్ అండ్ వెబ్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

అయితే ఈ కామెంట్స్ పై చలోక్తులు కూడా వినపడుతున్నాయి. అప్పటి నుండే జగన్ తన సన్నిహితులకు టెండర్ పెట్టేవాడని, ఏఎన్నార్ చేతిలో సుమంత్ ను బుక్ చేసినట్లే, వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను బుక్ చేసారని, ‘పువ్వు పుట్టగానే పరిమళించడం’ జగన్ ను చూస్తే అర్ధమవుతోందని నెటిజన్లు చేస్తున్న కామెంట్లు కోకొల్లలు.