“ఎన్టీఆర్” బయోపిక్ పోస్టర్లను ఇప్పటివరకు ‘ఔరా’ అన్న హావభావాలే సర్వత్రా వ్యక్తమయ్యాయి. బాలకృష్ణలో ఎన్టీఆర్ ను, రానాలో చంద్రబాబు నాయుడులను దిగ్విజయంగా చూపించిన దర్శకుడు, తాజాగా సుమంత్ లో ఏఎన్నార్ ను అత్యద్భుతంగా ప్రజెంట్ చేసారు. ఏఎన్నార్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని విడుదల చేసిన ఈ పోస్టర్ కు విశేషమైన ఆదరణ లభిస్తోంది.
ఇందులో సుమంత్ కాకుండా ఏఎన్నారే కనిపిస్తున్నారని చెప్పడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. ఒక రకంగా ఆశ్చర్యకరంగా కూడా ఉంది. ఈ పోస్టర్ల వెల్లువ చూస్తుంటే, ఈ సినిమా విడుదల తర్వాత క్రిష్ క్రేజ్ రెండింతలు అవుతుందన్న నమ్మకాలు కలిగిస్తున్నాయి. నానాటికి “ఎన్టీఆర్” బయోపిక్ మూవీ ఎక్కడలేని క్రేజ్ ను సొంతం చేసుకుంటోంది. అందరూ ముక్తకంఠంతో… ‘క్రిష్… నువ్వు మామూలోడు కాదయ్యా…’ అంటున్నారు.