Sumanth as ANR in NTR biopicSumanth as ANR in NTR biopicనందమూరి తారక రామారావు జీవితగాధతో తెరకెక్కుతోన్న “ఎన్టీఆర్” బయోపిక్ రోజురోజుకు మరింతగా ప్రతిష్టాత్మకంగా మారుతోంది. చంద్రబాబు నాయుడు పాత్రను రానా పోషిస్తున్న విషయం బయటకు వచ్చిన మరుసటి రోజు, మరో హీరో ఈ ప్రాజెక్ట్ లో చేరిన విషయం అధికారికంగా ఖరారయ్యింది.

ఎన్టీఆర్ జీవితంలో అక్కినేని నాగేశ్వరరావు పాత్ర కూడా ఉండడంతో, ఏఎన్ఆర్ రోల్ ను సుమంత్ పోషిస్తున్నట్లుగా అధికారికంగా ట్వీట్ చేసారు. ఈ ప్రాజెక్ట్ లో తాత గారైన ఏఎన్ఆర్ రోల్ లో నటిస్తున్నానని, ఇది తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని సుమంత్ స్పష్టంగా తెలిపారు.

ఏఎన్ఆర్ రోల్ ఖరారు కావడంతో, తదుపరి లుక్ సూపర్ స్టార్ కృష్ణ రోల్ పై సినీ వర్గాలు ఆసక్తి చూపుతున్నాయి. ఈ రోల్ ను మహేష్ చేస్తున్నారని గతంలో హల్చల్ చేసినప్పటికీ, అవన్నీ పుకార్లేనని తేలిపోయాయి. ఎన్టీఆర్ జీవితంలో ఏఎన్ఆర్ రోల్ సినిమాల వరకే పరిమితం కాగా, కృష్ణ పాత్ర రాజకీయాలలో కొనసాగిన విషయం తెలిసిందే.