Sumanth about balakrishna Nandamuriఅక్కినేని సుమంత్…ఈ కుర్ర హీరో తన కెరీర్ తోలి రోజుల్లో మంచి హిట్స్ తో పరవాలేదు అని అనిపించినా ఆ తర్వాత వరుస ఫ్లోప్స్ తో తెరవెనక్కి వెళ్ళిపోయాడు. అయితే సహజంగా థ్రిల్లర్స్ అంటే పెద్దగా ఇష్టపడని సుమంత్ దర్శకుడు సంతోష్ జాగర్లమూడి కథ నచ్చి “సుబ్రహ్మణ్యపురం” సినిమాను చెయ్యడానికి ఒప్పుకున్నాడు.

ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒకానొక ఇంటర్వ్యూలో ఆయన ప్రస్తుతం తాను చేస్తున్న సినిమా గురించి వివరిస్తూ చాలా విషయాలే ఆ ఛానెల్ తో పంచుకున్నాడు. ఇక ఎన్ఠీఆర్ బయోపిక్ లో ఏకంగా అలనాటి తాతగారి పాత్రను పోషిస్తున్న క్రమంలో ఎలా ఉంది ఆ ఫీలింగ్? బాలయ్య గారితో వర్కింగ్ అని అడగగానే. తాతయ్య పాత్ర నాకు దొరకడం చాల అదృష్టం, మా కుటుంభం మొత్తం నేను ఆయనలానే ఉంటాను అని అంటారు…అని అంటూనే, మరో పక్క బాలయ్య గారా….వామ్మో ఆయనో ” Encyclopedia” వంటి వారు. ఆయన ఇప్పటివరకూ చేసిన ప్రతీ సినిమాలో డైలాగు గుర్తు ఉంటుంది. ఎప్పుడు అడిగినా టక్కున చెప్తారు. ఆయనతో కలసి పనిచెయ్యడం నిజంగా అదృష్టం అనే చెప్పాలి అని అన్నాడు సుమంత్.

ఇక ఈ సినిమాలో తాను దేవుణ్ణి నమ్మని పాత్ర చేస్తున్నాను అని, అయితే నిజ జీవితంలో తాను దేవుణ్ణి నమ్ముతాను అని, అదే క్రమంలో అన్ని ప్రార్ధనా మందిరాలకు వెళ్తాను అని సుమంత్ చెప్పారు. మరి వరుస ఫ్లోప్స్ తో తన క్రేజ్ పోగొట్టుకున్న సుమంత్ కి ఈ సినిమాతో మళ్ళీ వరుస సినిమాలు వస్తాయి అని ఆశిద్దాం.