Sukumar Ram Charan, Sukumar Ram Charan Movie, Sukumar Ram Charan Combo, Ram Charan in Sukumar Direction, Sukumar Ram Charan New Movie, Sukumarటాలీవుడ్ బ్రిలియంట్ డైరెక్టర్ గా సినీ విమర్శకుల నుండి కితాబు అందుకున్న సుకుమార్ సినిమాలంటే చెవి ప్రత్యేకమైన కోసుకునే అభిమానులున్నారు. ‘1 నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో’ వంటి సినిమాల ద్వారా సుకుమార్ లో ఉన్న సరికొత్త యాంగిల్ ప్రేక్షకులకు సుపరిచితం కావడంతో, సుక్కూ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దీంతో సుకుమార్ తన తదుపరి సినిమాలో ఎలాంటి అంశంతో ముందుకొస్తారో అన్న ఆసక్తి సినీ అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాల్లో కూడా ఏర్పడింది.

మెగా వారసుడు రామ్ చరణ్ తో తన తదుపరి సినిమాకు సుకుమార్ కసరత్తులు చేస్తున్నారన్న విషయం తెలిసిందే. ‘ఫార్ములా ఎక్స్’ పేరుతో ఓ సైంటిఫిక్ సినిమాకు రూపకల్పన చేస్తున్నారన్న వార్తలు ఇటీవల హల్చల్ చేయగా, తాజా సమాచారం మేరకు ఓ గ్రామీణ ప్రేమకధా చిత్రం కోసం సుకుమార్ కలం పట్టుకున్నారని తెలుస్తోంది. మైండ్ గేమ్ సినిమాలను ఎన్ని తెలివితేటలతో సుకుమార్ తెరకేక్కిస్తారో అంతే అద్భుతంగా ప్రేమకధలను కూడా అందిస్తారన్న విషయం ‘100% లవ్, ఆర్య’ సినిమాలు చెప్పకనే చెప్పాయి.

దీంతో చెర్రీ సినిమాకు సుకుమార్ అందించబోయే కధపై ఉత్కంఠ నెలకొంది. రొటీన్ గా చెప్పడమనేది సుకుమార్ డిక్షనరీలో లేని పదం. దీంతో ఏ కధ అయినా అది సుకుమార్ స్టైల్లోనే ఉంటుంది గనుక, మెగా ఫ్యాన్స్ పండగ చేసుకోవచ్చు. ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న ‘ధృవ’ సినిమా పూర్తయిన తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.