Sukumar-Straight-Narration-for-Mahesh-babuరామ్ చరణ్ తో తెరకెక్కించిన “రంగస్థలం” సినిమా తర్వాత డైరెక్టర్ సుకుమార్ పేరు ఎలా మారుమ్రోగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ గా ఖ్యాతి గాంచిన సుకుమార్ కు ‘రంగస్థలం’ తర్వాత విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో సుకుమార్ నెక్స్ట్ హీరో ఎవరనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొనగా, అంతలో ప్రిన్స్ మహేష్ బాబు పేరు అధికారికంగా వినిపించింది.

“1 నేనొక్కడినే” కాంబో మళ్ళీ రిపీట్ అవుతున్నందుకు ప్రిన్స్ అభిమానులు కూడా ఫుల్ ఖుషీలో ఉన్నారు. అందులోనూ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయనుండడంతో, మరో బ్లాక్ బస్టర్ పక్కా అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. అయితే ఈ సినిమా స్టోరీపై ఇంకా స్పష్టత రాకపోవడంతో, ప్రస్తుతం ఈ కాంబోపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ ప్రాజెక్ట్ కాన్సిల్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదంటూ ప్రచారం కూడా జరుగుతోంది.

‘రంగస్థలం’ రిజల్ట్ తర్వాత సుకుమార్ ఏం చెప్పినా సెట్స్ పైకి వెళ్ళడానికి బోలెడు మంది రెడీగా ఉంటే, సుకుమార్ మాత్రం మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ కోసం వేచిచూస్తున్నారు. ఇటీవల ఓ పీరియాడిక్ స్టోరీ చెప్పగా, అందుకు మహేష్ ఒప్పుకోలేదని, దీంతో మరో స్క్రిప్ట్ పై సుకుమార్ రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది. అయితే “మహర్షి” ముగిసే లోపున ఈ స్క్రిప్ట్ తుది దశకు చేరుకుంటే పర్లేదు గానీ, లేదంటే సుకుమార్ తో సినిమా డేంజర్ లో పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.