Sujana-Chowdary-Clears-Air-Admits-Allegations-Are-False!ఒకప్పుడు టీడీపీ తరపున ముక్తసరిగానైనా ప్రత్యేక హోదా ఉద్యమంలో పాల్గొన్న సుజానా చౌదరి, ఎన్నికలలో టీడీపీ ఓటమి తరువాత బీజేపీలో చేరిపోయారు. ఇప్పుడు సహజంగానే ప్రత్యేక హోదా కుదరదు అనే అంటారు. మరోవైపు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ కు మాత్రం ఆయన ఇంకా చంద్రబాబు ఏజెంట్ అనే అనుమానం.

అందుకు అనుగుణంగానే ఆయన అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంటారు. ఈరోజు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ… ఏపీలో గత 6 నెలల్లో ఒక ఉద్యోగం ఎవరికైనా వచ్చిందా?..ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా? అని ప్రశ్నించారు. రాజకీయాలు, ఎన్నికల ధోరణి నుంచి బయటికి వచ్చి జగన్‌ ఇప్పటికైనా పరిపాలనపై దృష్టి సారించాలన్నారు. ‘‘

25 మంది ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తామన్నారు. ఇప్పుడు ఏమైంది, వైసీపీకి 22 మంది ఎంపీలు ఉండి ఏం లాభం?.’ అని ఆయన ప్రశ్నించారు. కారణం ఏదైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక హోదా డిమాండును అటకెక్కించారు. అది నరేంద్ర మోడీ ప్రభుత్వానికి, బీజేపీకి మంచిదే.

ఇప్పుడు ఆ డిమాండును జగన్ మళ్ళీ తెర మీదకు తీసుకురావాలని సుజనా ఎందుకు కోరుకుంటున్నారు? మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీల మీద కూడా బీజేపీ కన్నేసిందని వదంతులు వ్యాపిస్తున్నాయి. అయితే అధికార పార్టీ నుండి ఏపీలో నామమాత్రంగా ఉన్న పార్టీలోకి ఎంపీలు మారితే అది విచిత్రమే.