sudheer babu prabhas friendshipమహేష్ బాబు బావ సుధీర్ బాబు నటించిన “భలే మంచి రోజు” సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు విడుదలైంది. పబ్లిసిటీ విషయంలో నేడు విడుదల కాబోతున్న మిగతా సినిమాల కన్నా “భలే మంచి రోజు” చాలా ముందుంది. మరీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే… సొంత బావమరిది అయిన ప్రిన్స్ మహేష్ కు బదులు ‘డార్లింగ్’ ప్రభాస్ చేత ప్రమోషనల్ ఇంటర్వ్యూ ఇప్పించడం!

‘సుధీర్ అండ్ కో’తో ప్రభాస్ చేసిన ఈ కార్యక్రమం గత రెండు రోజులుగా అన్ని ప్రధాన మీడియా మాధ్యమాలలో ప్రసారమైంది. ఈ ప్రోగ్రాం ‘భలే మంచి రోజు’ పబ్లిసిటీకి బాగా దోహదపడ్డట్లు కనపడుతోంది. అందుకనే సుధీర్ సినిమాకు ఎప్పుడూ అండగా ఉండే మహేష్ అభిమానులతో పాటు, ప్రభాస్ ఫ్యాన్స్ కు కూడా చిత్ర నిర్మాతలు ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలిపారు. అయితే ప్రభాస్ తో ప్రోగ్రాం చేయించడంలో ఉద్దేశం ఏమిటో సుధీర్ బాబు బయట పెట్టారు.

“సినిమాల్లోకి రాక‌ ముందు నుండే ‘డార్లింగ్’ ప్ర‌భాస్‌తో నాకు ప‌రిచ‌యం ఉంది. యువీ క్రియేష‌న్స్ సంస్థ ప్రతినిధులు వంశీ, విజ‌య్, మేమందరం క‌లిసి సినిమాల‌ను పంపిణీ చేసే వాళ్లం. మేమంతా ఎప్ప‌టి నుంచో మంచి ఫ్రెండ్స్” అంటూ ప్రభాస్ తో తనకున్న సాన్నిహిత్యం గురించి తెలిపారు సుధీర్ బాబు.